నాకేం కాలేదు.. అధైర్య పడకండి.. నేను బాగానే ఉన్నా..!

మ్యాన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంటరీ చిత్ర షూటింగ్ సమయంలో.. సూపర్ స్టార్ రజనీకాంత్ కు తీవ్ర గాయాలైనట్టు వచ్చిన వార్తలు ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. రజనీకి ఏమైందన్న ఆలోచన.. అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ చర్చకు వచ్చింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది.. అన్న ప్రశ్నే అంతటా వినిపించింది. అభిమానుల్లో ఆందోళనలు పెరుగుతున్న విషయం తెలిసి స్వయంగా రజనీకాంతే స్పందించారు. తనకు ముళ్లు గీసుకున్నాయి తప్ప.. పెద్దగా ప్రమాదం కాలేదని చెప్పారు. ఎవరూ ఆందోళన పడవద్దన్నారు. […]

Advertisement
Update:2020-01-29 06:36 IST

మ్యాన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంటరీ చిత్ర షూటింగ్ సమయంలో.. సూపర్ స్టార్ రజనీకాంత్ కు తీవ్ర గాయాలైనట్టు వచ్చిన వార్తలు ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. రజనీకి ఏమైందన్న ఆలోచన.. అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ చర్చకు వచ్చింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది.. అన్న ప్రశ్నే అంతటా వినిపించింది.

అభిమానుల్లో ఆందోళనలు పెరుగుతున్న విషయం తెలిసి స్వయంగా రజనీకాంతే స్పందించారు. తనకు ముళ్లు గీసుకున్నాయి తప్ప.. పెద్దగా ప్రమాదం కాలేదని చెప్పారు. ఎవరూ ఆందోళన పడవద్దన్నారు. తాను భేషుగ్గా ఉన్నానని.. అభిమానులు ధైర్యంగా ఉండాలని చెప్పారు.

ఓ ఇంగ్లిష్ ఛానల్ తీస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం రజనీ.. కర్ణాటక లోని గుండ్లపేట ప్రాంతానికి వెళ్లారు. అక్కడే చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఈ వార్త బాగా వైరల్ కావడంతో… రజనీ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. షూటింగ్ ముగించుకుని చెన్నై చేరుకున్న అనంతరం.. విలేకరులతో మాట్లాడిన రజనీ.. తాను బాగున్న విషయాన్ని ప్రకటించారు.
అలా.. ఈ ఊహాగానాలకు, ఆందోళనలకు సూపర్ స్టార్ తెరదించారు.

Tags:    
Advertisement

Similar News