సచిన్ స్వదేశీ రికార్డుకు విరాట్ గురి

సొంతగడ్డపై 20 వన్డే సెంచరీలతో సచిన్ టాప్ 19 వన్డే శతకాలతో సచిన్ తర్వాతి స్థానంలో కొహ్లీ భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ ద్వారా…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న మరో రికార్డును అధిగమించడానికి విరాట్ కొహ్లీ ఉరకలేస్తున్నాడు. వన్డే క్రికెట్లో సచిన్ సాధించిన మొత్తం 49 శతకాలలో 20 సెంచరీలు భారతగడ్డపైనే సాధించినవి కావడం విశేషం. ఈ రికార్డును అధిగమించాలంటే ఇప్పటికే స్వదేశీగడ్డపై 19 సెంచరీలు సాధించిన విరాట్ కొహ్లీ మరొక్క శతకం బాదితే చాలు. […]

Advertisement
Update:2020-01-14 06:45 IST
  • సొంతగడ్డపై 20 వన్డే సెంచరీలతో సచిన్ టాప్
  • 19 వన్డే శతకాలతో సచిన్ తర్వాతి స్థానంలో కొహ్లీ

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ ద్వారా…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న మరో రికార్డును అధిగమించడానికి విరాట్ కొహ్లీ ఉరకలేస్తున్నాడు.

వన్డే క్రికెట్లో సచిన్ సాధించిన మొత్తం 49 శతకాలలో 20 సెంచరీలు భారతగడ్డపైనే సాధించినవి కావడం విశేషం. ఈ రికార్డును అధిగమించాలంటే ఇప్పటికే స్వదేశీగడ్డపై 19 సెంచరీలు సాధించిన విరాట్ కొహ్లీ మరొక్క శతకం బాదితే చాలు.

సచిన్ 20, కొహ్లీ 19 శతకాలు…

సచిన్ తన సుదీర్ఘ కెరియర్ లో 463 వన్డేలు ఆడి ..49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలతో సహా 18వేల 426 పరుగులు సాధించాడు. మొత్తం 49 వన్డే శతకాలలో.. 20 స్వదేశీగడ్డపైన, 19 విదేశీ గడ్డపైన సాధించాడు.

భారత కెప్టెన్, ప్రపంచ టాప్ ర్యాంక్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి మాత్రం 2019 సీజన్ వరకూ ఆడిన మొత్తం 242 వన్డేలలో 43 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 11 వేల 609 పరుగులు నమోదు చేశాడు.

కొహ్లీ సాధించిన 43 వన్డే శతకాలలో 19 సెంచరీలు భారతగడ్డపైన సాధించినవే కావడం విశేషం

Tags:    
Advertisement

Similar News