13న కేసీఆర్, జగన్ భేటీ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నారు. ఈనెల 13న కేసీఆర్, జగన్‌మోహన్ రెడ్డిలు హైదరాబాద్ వేదికగా భేటీ కాబోతున్నారు. ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో… విభజన చట్టంలోని అంశాలపైనా చర్చించనున్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం జఠిలంగా మారడంతో… ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాలపైనా ఈ భేటీలో చర్చ జరగవచ్చు. ఆర్టీసీ ఆస్తుల అంశం కూడా ఎజెండాలో ప్రధాన అంశంగా ఉండనుంది. నదీ జలాల వినియోగం పైనా చర్చ […]
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నారు. ఈనెల 13న కేసీఆర్, జగన్‌మోహన్ రెడ్డిలు హైదరాబాద్ వేదికగా భేటీ కాబోతున్నారు.
ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో… విభజన చట్టంలోని అంశాలపైనా చర్చించనున్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం జఠిలంగా మారడంతో… ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాలపైనా ఈ భేటీలో చర్చ జరగవచ్చు. ఆర్టీసీ ఆస్తుల అంశం కూడా ఎజెండాలో ప్రధాన అంశంగా ఉండనుంది.
నదీ జలాల వినియోగం పైనా చర్చ జరుగుతుందని చెబుతున్నారు. అయితే గతంలో రెండు రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా ప్రాజెక్టులు నిర్మించాలనుకున్నా ఆ తర్వాత ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. వేరువేరుగా సొంతంగానే ప్రాజెక్టులు నిర్మించుకునే ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ భేటీలో నదీ జలాల అంశం కీలకం అవుతుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.