తగ్గనున్న ఏపీ విద్యార్థుల పుస్తకాల బరువు

సెమిస్టర్ల వారీగా ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురావాలని విద్యాశాఖ ప్రణాళిక

Advertisement
Update:2025-01-11 12:11 IST

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించడానికి పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. సెమిస్టర్ల వారీగా అన్నింటిని కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించింది. ఒకటి, రెండు తరగతులకు సంబంధించి మొదటి సెమిస్టర్ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురానున్నారు. దీనికి అదనంగా మరో వర్క్‌బుక్‌ ఉంటుంది. రెండో సెమిస్టర్‌లోనూ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక పాఠ్యపుస్తకంగా ఇస్తారు. వర్క్‌బుక్‌ ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం నిర్వహించిన చర్చల్లో పాఠశాల విద్యాశాఖ అధికారులు వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న పలు అంశాలను వెల్లడించారు.

3-5 తరగతులకు మొదటి సెమిస్టర్‌లో భాష సబ్జెక్టులు అన్ని కలిపి ఒక పుస్తకం, వర్క్‌బుక్‌, ఇతర సబ్జెక్టులన్నీ కలిపి మరో పుస్తకం, వర్క్‌ బుక్‌ ఇస్తారు. 9-10 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న హిందీ పాఠ్యపుస్తకాన్ని తొలిగింఇచ, రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని తీసుకొస్తారు.

అనుమతి లేకుండా గైర్హాజరయ్యే ఉపాధ్యాయులకు బదిలీల సమయంలో నెలకో పాయింట్‌ చొప్పున గరిష్ఠంగా 10 మైనస్‌ పాయింట్లు ఇస్తారు. సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలు నవీకరించుకోవాలి. ఇప్పటివరకు 94 వేల మంది తమ వివరాలను నవీకరించకున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు చట్టం తీసుకొస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తారు. బదిలీల్లో కేటగిరీల వారీగా పాయింట్లు ఉంటాయి.

\

Tags:    
Advertisement

Similar News