పౌరసత్వ సవరణ బిల్లుపై కొహ్లీ నో కామెంట్

విషయం తెలియకుండా మాట్లాడటం తగదన్న కెప్టెన్ పౌరసత్వ సవరణబిల్లుపై ఓవైపు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంటే…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం నో కామెంట్ అంటూ తప్పించుకొన్నాడు. శ్రీలంకతో తీన్మార్ టీ-20 సిరీస్ లోని తొలి మ్యాచ్ గౌహతి బారస్పారా స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్యభారత రాష్ట్ర్రాలు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చే్స్తున్నాయి. అయితే…పౌరసత్వసవరణ బిల్లుపై తాను మాట్లాడేదేమీలేదని…ఆ బిల్లు పట్ల తనకు తగిన అవగాహనలేదని భారత కెప్టెన్ విరాట్ కొహ్లీవ్యాఖ్యానించాడు. […]

Advertisement
Update:2020-01-05 05:58 IST
  • విషయం తెలియకుండా మాట్లాడటం తగదన్న కెప్టెన్

పౌరసత్వ సవరణబిల్లుపై ఓవైపు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంటే…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం నో కామెంట్ అంటూ తప్పించుకొన్నాడు.

శ్రీలంకతో తీన్మార్ టీ-20 సిరీస్ లోని తొలి మ్యాచ్ గౌహతి బారస్పారా స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్యభారత రాష్ట్ర్రాలు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చే్స్తున్నాయి.

అయితే…పౌరసత్వసవరణ బిల్లుపై తాను మాట్లాడేదేమీలేదని…ఆ బిల్లు పట్ల తనకు తగిన అవగాహనలేదని భారత కెప్టెన్ విరాట్ కొహ్లీవ్యాఖ్యానించాడు.

విషయం తెలియకుండా మాట్లాడటంలో అర్థం లేదని, పౌరసత్వసవరణ బిల్లుకు సంబంధించి తనకు కనీసఅవగాహన లేదని తెలిపాడు.

గతంలో …భారీనోట్ల రద్దుపై మోడీ ప్రభుత్వం తీసుకొన్న చర్య విప్లవాత్మకమైనదని, చరిత్రలో నిలిచిపోతుందంటూ వ్యాఖ్యానించడం ద్వారా విరాట్ కొహ్లీ తీవ్రవిమర్శలు ఎదుర్కొన్నాడు.

గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని లేని వివాదంలో తలదూర్చడం ఎందుకనో ..ఏమో…కొహ్లీ మాత్రం తనకు కనీస అవగాహన లేదంటూ వ్యాఖ్యానించడానికి తెలివిగా నిరాకరించాడు.

గౌహతీ వేదికగా టీ-20 మ్యాచ్ జరిగే సమయంలో ఏ విధమైన నిరసన ప్రదర్శనలు జరుగకుండా…ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. 3వేల మంది పోలీసులతో అసోం ప్రభుత్వం ముందు జాగ్రత్తచర్యలుతీసుకొంది.కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

Tags:    
Advertisement

Similar News