రండి గుండెల్లో పెట్టుకుంటాం... జగన్‌

విశాఖ పరిపాలన రాజధాని అవుతుందన్న ప్రతిపాదనల మధ్య స్టీల్‌ సిటీలో అడుగుపెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి అద్భుతమైన స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ ఉత్సవ్ వేదిక వరకు జగన్మోహన్ రెడ్డికి జనం నిరాజనం పలికారు. రోడ్డు వెంబడి వేలాది మంది జనం నిలబడి ప్లకార్డులతో జగన్‌కు స్వాగతం పలికారు. ‘విశాఖకు రండి మా గుండెల్లో పెట్టుకుంటాం’ అంటూ పలువురు ప్లకార్డులతో సీఎంకు వెల్‌కమ్ చెప్పారు. దారి పొడవున జగన్‌ కాన్వాయ్‌పై పూలజల్లు […]

Advertisement
Update:2019-12-29 04:00 IST

విశాఖ పరిపాలన రాజధాని అవుతుందన్న ప్రతిపాదనల మధ్య స్టీల్‌ సిటీలో అడుగుపెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి అద్భుతమైన స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ ఉత్సవ్ వేదిక వరకు జగన్మోహన్ రెడ్డికి జనం నిరాజనం పలికారు.

రోడ్డు వెంబడి వేలాది మంది జనం నిలబడి ప్లకార్డులతో జగన్‌కు స్వాగతం పలికారు. ‘విశాఖకు రండి మా గుండెల్లో పెట్టుకుంటాం’ అంటూ పలువురు ప్లకార్డులతో సీఎంకు వెల్‌కమ్ చెప్పారు. దారి పొడవున జగన్‌ కాన్వాయ్‌పై పూలజల్లు కురిపించారు మహిళలు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికేందుకు వచ్చారు.

జగన్‌ కాన్వాయ్‌ వస్తుంటే నగర ప్రజలు…. రాజధాని తరలివచ్చినట్టుగా ఉద్వేగానికి లోనయ్యారు. పరిపాలన రాజధాని చేస్తామని ప్రకటన చేసినందుకే జగన్‌కు విశాఖ, ఉత్తరాంధ్రవాసులు అరుదైన స్వాగతం పలికారు. బహుశా 10 లక్షల కోట్లు పెట్టి రాజధానిని కట్టినా అక్కడి వారు జగన్‌ పట్ల ఇంత కృతజ్ఞత చూపేవారు కాదేమో… కానీ విశాఖ ప్రజలు మాత్రం తమ ప్రేమను స్వాగతంలోనే జగన్‌పై కురిపించారు.

పరిపాలన రాజధానిపై శుక్రవారమే కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ తాత్కాలికంగా వాయిదా పడినా… ఆ భావన ఎక్కడా జగన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన విశాఖ ప్రజల్లో కనిపించలేదు. తమకు పరిపాలన రాజధాని ఖాయమన్న ధీమానే వారిలో కనిపించింది. బహుశా జగన్‌ మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి కాస్త ఆలస్యంగానైనా జరిగి తీరుతుందన్న నమ్మకం కావొచ్చు.

Tags:    
Advertisement

Similar News