ఎట్టకేలకు కలుస్తున్న సూపర్ హిట్ జోడీ

ఒకటి కాదు, రెండు కాదు.. కలిసి 16 సినిమాలు చేశారు. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయిన అతికొద్ది సూపర్ హిట్ కాంబినేషన్స్ లో వాళ్లది కూడా ఒకటి. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఆ జోడీకి ఒకరంటే ఒకరికి పడదు. వాళ్లే చిరంజీవి, విజయ్ శాంతి. వీళ్లిద్దరి పేర్లు చెప్పగానే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అలా కళ్లముందు కదలాడుతాయి. కేవలం యాక్టింగ్ లోనే కాదు, డాన్స్ పరంగా కూడా ఇద్దరూ పోటీపడి నటించారు. తర్వాత రాజకీయంగా, […]

Advertisement
Update:2019-12-29 08:30 IST

ఒకటి కాదు, రెండు కాదు.. కలిసి 16 సినిమాలు చేశారు. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయిన అతికొద్ది సూపర్ హిట్ కాంబినేషన్స్ లో వాళ్లది కూడా ఒకటి. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఆ జోడీకి ఒకరంటే ఒకరికి పడదు. వాళ్లే చిరంజీవి, విజయ్ శాంతి. వీళ్లిద్దరి పేర్లు చెప్పగానే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అలా కళ్లముందు కదలాడుతాయి. కేవలం యాక్టింగ్ లోనే కాదు, డాన్స్ పరంగా కూడా ఇద్దరూ పోటీపడి నటించారు.

తర్వాత రాజకీయంగా, వ్యక్తిగతంగా వచ్చిన భేదాభిప్రాయాల వల్ల చిరు-విజయశాంతి ఎక్కడా కలుసుకోలేదు. ఒక దశలో చిరంజీవిపై విజయశాంతి తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే అదంతా గతం. ఇటు చిరంజీవి, అటు విజయశాంతి ఇద్దరూ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇద్దరూ మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. సో.. ఇద్దరూ కలవబోయే సందర్భం కూడా దగ్గర్లోనే ఉంది.

అవును.. దాదాపు 20 ఏళ్ల తర్వాత చిరంజీవి, విజయశాంతి కలవబోతున్నారు. ఒకే వేదిక పంచుకోబోతున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకోబోతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. సో.. ఆమె ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వస్తుంది. ఇదే ఫంక్షన్ కు చిరంజీవి కూడా ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు.

అలా 20 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ ఒకే వేదికపై కలవబోతున్నారు. సో.. ఈసారి వేదికపై మహేష్-రష్మిక జంట కంటే.. చిరు-విజయశాంతి జోడీనే అందర్నీ ఎక్కువగా ఆకర్షించబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగబోతోంది.

Tags:    
Advertisement

Similar News