మరోసారి రజనీకాంత్ హ్యాండ్ ఇస్తాడేమో!

రజనీకాంత్ కు ఎప్పటికైనా కోలీవుడ్డే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ ఇండస్ట్రీనైనా. ఇందులో తప్పులేదు. ఎందుకంటే అతడికి తమిళనాటే మార్కెట్ ఎక్కువ. కాబట్టి దానికే అతడు ఇంపార్టెన్స్ ఇస్తాడు. కానీ ప్రతిసారి తెలుగులో ఫంక్షన్ అని చెప్పి హ్యాండ్ ఇవ్వడం మాత్రం తప్పు. ఈసారి కూడా రజనీకాంత్ ప్రకటించాడు. 3న హైదరాబాద్ వస్తున్నాం, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నాడు. వస్తాడా రాడా అనేది చూడాలి. గతంలో 2.O సినిమా రిలీజ్ టైమ్ లో ఇలానే […]

Advertisement
Update:2019-12-28 12:30 IST
మరోసారి రజనీకాంత్ హ్యాండ్ ఇస్తాడేమో!
  • whatsapp icon

రజనీకాంత్ కు ఎప్పటికైనా కోలీవుడ్డే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏ ఇండస్ట్రీనైనా. ఇందులో తప్పులేదు. ఎందుకంటే అతడికి తమిళనాటే మార్కెట్ ఎక్కువ. కాబట్టి దానికే అతడు ఇంపార్టెన్స్ ఇస్తాడు. కానీ ప్రతిసారి తెలుగులో ఫంక్షన్ అని చెప్పి హ్యాండ్ ఇవ్వడం మాత్రం తప్పు. ఈసారి కూడా రజనీకాంత్ ప్రకటించాడు. 3న హైదరాబాద్ వస్తున్నాం, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నాడు. వస్తాడా రాడా అనేది చూడాలి.

గతంలో 2.O సినిమా రిలీజ్ టైమ్ లో ఇలానే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అని ప్రకటించారు. కానీ అప్పుడు రజనీకాంత్ రాలేదు. రెండేళ్ల కిందట సంక్రాంతికి కూడా పేట సినిమా టైమ్ లో హైదరాబాద్ లో పెద్ద ఫంక్షన్ అన్నారు. అప్పుడు కూడా రజనీకాంత్ హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ దర్బార్ టైమ్ కు అదే మాట. సో.. ఈసారి సూపర్ స్టార్ వస్తాడా రాడా అనే అనుమానాన్ని వ్యక్తంచేస్తున్నారు చాలామంది.

ఈ సంగతి పక్కనపెడితే.. ఈసారి రజనీకాంత్ మూవీకి తెలుగులో పూర్తిగా మార్కెట్ పడిపోయింది. అతడి గత చిత్రాలేవీ ఇక్కడ పెద్దగా ఆడలేదు. దీంతో దర్బార్ మూవీని తెలుగు ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఆ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కేవలం 30 కోట్ల రూపాయల లోపు మొత్తానికే అమ్మారంటే, సూపర్ స్టార్ మార్కెట్ ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News