వైల్డ్ డాగ్ గా మారిన నాగార్జున
సోలమన్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున ఓ సినిమా చేయబోతున్నాడనే పుకారు చాన్నాళ్లుగా ఉంది. ఆ మేటర్ ను నాగ్ ఎప్పుడూ కన్ ఫర్మ్ చేయలేదు. ఓ సందర్భంగా చూచాయగా మాత్రమే చెప్పాడు. అప్పుడు కూడా ప్రాజెక్టు ఓకే అయినట్టు ప్రకటించలేదు. కట్ చేస్తే, ఇప్పుడు ఏకంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు నాగ్. డైరక్టర్ అతడే. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ పూర్తయింది. అది కంప్లీట్ […]
సోలమన్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున ఓ సినిమా చేయబోతున్నాడనే పుకారు చాన్నాళ్లుగా ఉంది. ఆ మేటర్ ను నాగ్ ఎప్పుడూ కన్ ఫర్మ్ చేయలేదు. ఓ సందర్భంగా చూచాయగా మాత్రమే చెప్పాడు. అప్పుడు కూడా ప్రాజెక్టు ఓకే అయినట్టు ప్రకటించలేదు. కట్ చేస్తే, ఇప్పుడు ఏకంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు నాగ్. డైరక్టర్ అతడే.
గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ పూర్తయింది. అది కంప్లీట్ అయిన తర్వాతే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రిలీజ్ చేసి, సినిమా చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించాడు నాగ్. దీని వెనక ఓ రీజన్ కూడా ఉంది. నాగ్ ఎప్పుడూ రిస్క్ తీసుకోడు. ఓ షెడ్యూల్ చూసిన తర్వాత సినిమా ప్రకటించాలనుకున్నాడు. అందుకే ఓ షెడ్యూల్ షూట్ చేశారు. అవుట్ పుట్ నచ్చడంతో ఇప్పుడు సినిమా ఎనౌన్స్ చేశారు.
ఈ సినిమాకు వైల్డ్ డాగ్ అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. సినిమాలో నాగ్ ఎన్ఐఏ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇతడి క్యారెక్టర్ పేరు విజయ్ వర్మ. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను మరో 2 నెలల్లో పూర్తిచేయబోతున్నారు.