ఉగాదికి తరలింపు పూర్తి....

అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖకు తరలించడం దాదాపు ఖాయం అయిపోయింది. నేడు కేబినెట్‌లో జీఎన్‌రావు కమిటీ రిపోర్టుకు ఆమోదం తెలపడం ద్వారా ప్రభుత్వం అధికారికంగా పావులు కదపనుంది. తొలుత జూన్‌ నుంచి తరలింపు మొదలుపెట్టాలని భావించినప్పటికీ… అసెంబ్లీలో జగన్ ప్రకటన తర్వాత అమరావతిలో కొందరు ఆందోళనలు చేస్తుండడంతో ఇక ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం సరికాదన్న భావనకు ప్రభుత్వం వచ్చింది. ఉగాది నాటికి సచివాలయం మొత్తం విశాఖలో కొలువుతీరేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఇప్పటికే జగన్ ఆదేశించారు. […]

Advertisement
Update:2019-12-27 03:45 IST

అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖకు తరలించడం దాదాపు ఖాయం అయిపోయింది. నేడు కేబినెట్‌లో జీఎన్‌రావు కమిటీ రిపోర్టుకు ఆమోదం తెలపడం ద్వారా ప్రభుత్వం అధికారికంగా పావులు కదపనుంది. తొలుత జూన్‌ నుంచి తరలింపు మొదలుపెట్టాలని భావించినప్పటికీ… అసెంబ్లీలో జగన్ ప్రకటన తర్వాత అమరావతిలో కొందరు ఆందోళనలు చేస్తుండడంతో ఇక ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం సరికాదన్న భావనకు ప్రభుత్వం వచ్చింది.

ఉగాది నాటికి సచివాలయం మొత్తం విశాఖలో కొలువుతీరేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఇప్పటికే జగన్ ఆదేశించారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులు పలు మీడియా సంస్థల వద్ద ధృవీకరిస్తున్నారు. ఉగాది నాటికి తరలింపు ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారులకు జగన్ సూచించారట.

నేడు కేబినెట్ భేటీలో తరలింపుకు ఆమోదం తెలిపిన తర్వాత రేపు జగన్ విశాఖపట్నం వెళ్తున్నారు. అక్కడ సీఎంకు కృతజ్ఞతా పూర్వకంగా స్వాగతం పలికేందుకు భారీగా జనం తరలి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

సచివాలయం తరలింపును వేగవంతం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో… విశాఖలో రోడ్లు, ఇతర అభివృద్ది పనుల కోసం ప్రభుత్వం 1300 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఇందుకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

Tags:    
Advertisement

Similar News