బీజేపీ ఓటమి... కేసీఆర్, జగన్ లకు ఊరట?
వరుసగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లకు ఊరటనిస్తున్నాయా అంటే అవుననే సమాధానం ఆయా పార్టీ వర్గాల నుంచి వస్తోందట.. దేశవ్యాప్తంగా ఒంటి చేత్తో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోడీ-షాలు రాష్ట్రాలను కబళించి ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలకు ప్లాన్ చేశారు. అయితే మోడీ 2023లో జమిలి ఎన్నికలకు వెళ్లి ప్రాంతీయ పార్టీలను.. ముఖ్యంగా దక్షిణాదిన బలమైన ప్రాతీయ […]
వరుసగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లకు ఊరటనిస్తున్నాయా అంటే అవుననే సమాధానం ఆయా పార్టీ వర్గాల నుంచి వస్తోందట.. దేశవ్యాప్తంగా ఒంటి చేత్తో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోడీ-షాలు రాష్ట్రాలను కబళించి ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలకు ప్లాన్ చేశారు.
అయితే మోడీ 2023లో జమిలి ఎన్నికలకు వెళ్లి ప్రాంతీయ పార్టీలను.. ముఖ్యంగా దక్షిణాదిన బలమైన ప్రాతీయ పార్టీలను లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు వరుసగా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమితో కమలదళం నైరాశ్యంలో మునిగిపోయింది. జమిలి ఎన్నికలపై పునరాలోచనలో పడిపోయినట్టు తెలిసింది. అంతులేని వ్యతిరేకత బీజేపీ పుట్టి ముంచుతోందన్న ఆందోళన వారిలో నెలకొందట.
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాక తిరుగులేని విధంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అమిత్ షా చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. ఇలానే దూకుడుగా వెళుతున్న అమిత్ షాకు ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ లో బీజేపీ ఓటమితో అంతర్మథనంలో పడిపోయినట్టు తెలుస్తోంది.
ప్రాంతీయ పార్టీలను కబళించాలని చూసిన బీజేపీకి ఇప్పుడు దక్షిణాది పాత మిత్రులు కేసీఆర్, జగన్ ల అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ ఓటమి సహజంగానే కేసీఆర్, జగన్ లలో జోష్ నింపుతోందట. బీజేపీ ఓడితేనే పార్లమెంట్ సీట్లు తగ్గితేనే తమ అవసరం ఏర్పడి తమకు నిధులు, కేంద్రం ద్వారా సాయం పొందవచ్చని కేసీఆర్, జగన్ లు ఆశపడుతున్నారు. అన్నట్టుగానే బీజేపీ ఓడుతోంది. జగన్, కేసీఆర్ లలో ఆశలు పెంచుతోంది.