కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలన్నీ ఒకేచోట పెట్టాలి... పాలన కేంద్రీకృతంగా ఉండాలి- ఉప రాష్ట్రపతి కొత్త మాట

రాజధాని అంశంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన మొత్తం ఒకేచోట కేంద్రీకరించాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలి… పరిపాలనను మొత్తం ఒకేచోట కేంద్రీకరించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని అడిగితే ఇదే చెబుతానన్నారు. రాజధాని రైతుల ఆవేదన చూసి తన మనసు చలించిపోయిందన్నారు. సీఎం ఆఫీస్, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, శాసన సభ, గవర్నర్ కార్యాలయం అన్ని ఒకే చోట ఉండాలని వెంకయ్యనాయుడు చెప్పారు. పరోక్షంగా మొత్తం అమరావతిలోనే పెట్టాలని తన మనసులో […]

Advertisement
Update:2019-12-25 06:29 IST

రాజధాని అంశంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన మొత్తం ఒకేచోట కేంద్రీకరించాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలి… పరిపాలనను మొత్తం ఒకేచోట కేంద్రీకరించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని అడిగితే ఇదే చెబుతానన్నారు. రాజధాని రైతుల ఆవేదన చూసి తన మనసు చలించిపోయిందన్నారు.

సీఎం ఆఫీస్, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, శాసన సభ, గవర్నర్ కార్యాలయం అన్ని ఒకే చోట ఉండాలని వెంకయ్యనాయుడు చెప్పారు. పరోక్షంగా మొత్తం అమరావతిలోనే పెట్టాలని తన మనసులో మాట చెప్పారు వెంకయ్యనాయుడు. తన అభిప్రాయాలను ఎక్కడ చెప్పాలో అక్కడ చెబుతానన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఒకే చోట కేంద్రీకరించాలని వెంకయ్యనాయుడు చెప్పారు. తాను రాజకీయాల నుంచి వైదొగినప్పటికీ ఇంకా ప్రజా జీవితంలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో స్థాయి పడిపోయిందని… శత్రువులు అనే భావన పెరిగిందన్నారు.

ఉప రాష్ట్రపతి ఇలా అన్ని కార్యాలయాలు ఒకే చోట పెట్టాలి అని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన కూడా తన మనసులో అమరావతిపైనా, అక్కడ ప్రజలపైన ఉన్న అభిమానాన్ని దాచుకోలేకపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News