అన్నీ అక్కడే అంటున్న రష్మిక

ప్రస్తుతం టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది రష్మిక. స్టార్ హీరోలంతా ఈమె కాల్షీట్ల కోసం వెయిటింగ్. అలా ఈ ఏడాది రెస్ట్ లేకుండా పనిచేసిన ఈ బ్యూటీకి, ఎట్టకేలకు కాస్త విశ్రాంతి తీసుకునే టైమ్ దొరికింది. అది కూడా న్యూ ఇయర్ టైమ్ లో. అవును.. ఈసారి నూతన సంవత్సర వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని రష్మిక డిసైడ్ అయింది. దీనికోసం ఆమె రోమ్ నగరాన్ని ఎంచుకుంది. […]

Advertisement
Update:2019-12-24 11:41 IST

ప్రస్తుతం టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది రష్మిక. స్టార్ హీరోలంతా ఈమె కాల్షీట్ల కోసం వెయిటింగ్. అలా ఈ ఏడాది రెస్ట్ లేకుండా పనిచేసిన ఈ బ్యూటీకి, ఎట్టకేలకు కాస్త విశ్రాంతి తీసుకునే టైమ్ దొరికింది. అది కూడా న్యూ ఇయర్ టైమ్ లో. అవును.. ఈసారి నూతన సంవత్సర వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని రష్మిక డిసైడ్ అయింది. దీనికోసం ఆమె రోమ్ నగరాన్ని ఎంచుకుంది.

భీష్మ సినిమా షూటింగ్ కోసం రోమ్ వెళ్లింది రష్మిక. షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది. జనవరి 4వరకు ఆమె రోమ్ లోనే ఉంటుంది. అంటే విశ్రాంతి తీసుకోవడంతో పాటు నూతన సంవత్సర వేడుకలు కూడా అక్కడే ఉన్నమాట. ఇదేదో ఉన్నఫలంగా రష్మిక తీసుకున్న నిర్ణయం కాదు.

రోమ్ ప్లాన్ ను ఆమె 5 నెలల కిందటే ఫిక్స్ చేసుకుందట. అందుకే సరిలేరు నీకెవ్వరు సినిమాను ఆమె అందరికంటే ముందే పూర్తిచేసింది. డబ్బింగ్ కూడా చెప్పేసింది. అలా ఆ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది. భీష్మ సినిమాను కూడా దాదాపు ఓ కొలిక్కి తీసుకొచ్చింది. అందుకే ఈ రెస్ట్ .

నూతన సంవత్సరంలో కూడా రష్మిక బిజీగా ఉండబోతోంది. ఆమె చేతిలో చాలా తెలుగు సినిమాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది అల్లు అర్జున్, సుకుమార్ సినిమా. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News