జార్ఖండ్‌లో బీజేపీ ఓట‌మికి అస‌లు కార‌ణం ఇదేనా !

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో క‌మ‌లం దెబ్బ‌తింది. కేవ‌లం 25 సీట్ల‌కు ఆ పార్టీ ప‌రిమిత‌మైంది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అనూహ్యంగా పుంజుకుంది. మేజిక్ మార్క్ ను దాటి (47) అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీకి 33.4 శాతం ఓట్లు వ‌స్తే…..జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూట‌మికి 35.37 శాతం ఓట్లు వ‌చ్చాయి. కేవ‌లం రెండు శాతం ఓట్ల తేడాతో బీజేపీకి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఏడాది కింద‌ట‌ రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఇటీవల మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన కాషాయదళానికి ఇప్పుడు జార్ఖండ్ […]

Advertisement
Update:2019-12-24 02:29 IST

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో క‌మ‌లం దెబ్బ‌తింది. కేవ‌లం 25 సీట్ల‌కు ఆ పార్టీ ప‌రిమిత‌మైంది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అనూహ్యంగా పుంజుకుంది. మేజిక్ మార్క్ ను దాటి (47) అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీకి 33.4 శాతం ఓట్లు వ‌స్తే…..జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూట‌మికి 35.37 శాతం ఓట్లు వ‌చ్చాయి. కేవ‌లం రెండు శాతం ఓట్ల తేడాతో బీజేపీకి భంగ‌పాటు త‌ప్ప‌లేదు.

ఏడాది కింద‌ట‌ రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఇటీవల మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన కాషాయదళానికి ఇప్పుడు జార్ఖండ్ లోనూ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో క‌మ‌లం చేతిలో నుంచి మ‌రో రాష్ట్రం జారిపోయింది. ఇప్పుడు కేవ‌లం గుజ‌రాత్‌, క‌ర్నాట‌క ….ఈ రెండు పెద్ద రాష్ట్రాల్లోనే బీజేపీ అధికారంలో ఉంది. మిగ‌తావి చాలా చిన్న రాష్ట్రాలు.

అయితే జార్ఖండ్‌లో బీజేపీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం ఒంటరిగా పోటీ చేయ‌డ‌మే. గత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్(ఏఎస్ జేయూ) పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చింది. మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కూడా 14 ఎంపీ స్థానాలకుగానూ 50 శాతానికి పైగా ఓట్ల శాతంతో 11 చోట్ల బీజేపీ గెలిచింది. ఈ విజ‌యంతో ఈ సారి ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైంది.

ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి 33.5 శాతం ఓట్లు వ‌స్తే …స్టూడెంట్ యూనియన్ పార్టీ 8.2 శాతం ఓట్లతో మూడు సీట్లను గెల్చుకుంది. ఈ రెండు పార్టీల ఓట్ల శాతాన్ని కలిపితే.. 41.7 శాతం అవుతుంది. అదే కాంగ్రెస్ కూటమికి దక్కిన ఓట్ల శాతం 35.37. స్టూడెంట్ యూనియన్ పార్టీని పక్కన పెట్టడం వల్ల బీజేపీ ఓడిపోయింది.

ఎన్నికలకు ముందు బీజేపీ, స్టూడెంట్ యూనియన్ పార్టీల మధ్య పొత్తు చర్చలు జ‌రిగాయి. కానీ సీట్ల పంప‌కాల్లో తేడాలు రావ‌డంతో పొత్తు కుద‌ర‌లేదు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోవాల్సి వ‌చ్చింది. ఇటు మ‌హారాష్ట్ర‌లో కూడా శివ‌సేన‌తో అధికార పంపిణీలో గొడ‌వ‌ల‌తో అక్క‌డ దూరం కావాల్సి వ‌చ్చింది.

జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి మరో ముఖ్య కారణం.. భూచట్టాల సవరణకు ప్రయత్నించడం. గిరిజనులకు తమ భూములపై హక్కులు కల్పించే ‘చోటా నాగ్ పూర్ టెనెన్సీ యాక్ట్‘, ‘సంతాల్ పర్గణా టెనెన్సీ యాక్ట్’ తదితర చట్టాలకు సవరణలు చేయాలని రఘుబర్ దాస్ సర్కారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. భూచట్టాల సవరణ యత్నాలకు వ్యతిరేకంగా పోరాడిన హేమంత్ సోరెన్ చివరికి హీరోగా నిలిచారు.

Tags:    
Advertisement

Similar News