నేడు ఉక్కుసాకారం

రాయలసీమ ప్రజల కల నెరవేరబోతోంది. కడప స్టీల్‌కు ముఖ్యమంత్రి జగనమోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయబోతున్నారు. జమ్మలమడుగు మండగలం సున్నపురాళ్లపల్లి దగ్గర ఉక్కు ఫ్యాక్టరీ కోసం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తారు. 15వేల కోట్ల పెట్టబడితో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంలో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఇందుకోసం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల వద్ద మూడు వేల 275 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌ పేరుతో […]

Advertisement
Update:2019-12-23 03:45 IST

రాయలసీమ ప్రజల కల నెరవేరబోతోంది. కడప స్టీల్‌కు ముఖ్యమంత్రి జగనమోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయబోతున్నారు. జమ్మలమడుగు మండగలం సున్నపురాళ్లపల్లి దగ్గర ఉక్కు ఫ్యాక్టరీ కోసం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తారు.

15వేల కోట్ల పెట్టబడితో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంలో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఇందుకోసం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల వద్ద మూడు వేల 275 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.

ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌ పేరుతో ఈ కంపెనీ పనిచేస్తుంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం శ్రద్ద చూపకపోవడంతో ముందుకు సాగలేదు. జగన్‌ సీఎం అయిన వెంటనే ఆ దిశగా వేగంగా అడుగులు వేశారు. ఉక్కు కార్మాగారానికి కీలకమైన ముడి ఇసుము సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో డిసెంబర్ 18న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్‌కు ఎన్‌ఎండీసీ 5 మిలియన్ టన్నుల ముడి ఇనుమును సరఫరా చేయబోతోంది.

ఫ్యాక్టరీ కోసం గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని కేటాయించారు. ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. యూనిట్‌ను శంకుస్థాపన చేసినప్పటి నుంచి మూడేళ్లలోనే ఈ కర్మాగారం నిర్మించి ఉత్పత్తి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. దాంతో ఎన్నోఏళ్ల కల నిజమవుతుందని రాయలసీమ ప్రజలు ధీమాతో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News