హైదరాబాద్‌ చేరుకున్న ఎయిమ్స్ బృందం... 'ఆ నాలుగు' మృతదేహాలకు రీపోస్టుమార్టం..!

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో నిందితులైన నలుగురు చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ నలుగురి మృతదేహాలను ఇంత వరకు బంధువులకు అప్పగించకుండా హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. కాగా, మూడు రోజుల క్రితం ఆ మృతదేహాలు కుళ్లిపోతున్నాయని.. వాటిని భద్రపరచలేమని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యులతో మరోసారి పోస్టుమార్టం జరిపి బంధువులకు అప్పగించాలని ఆదేశించింది. […]

Advertisement
Update:2019-12-23 03:30 IST

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో నిందితులైన నలుగురు చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ నలుగురి మృతదేహాలను ఇంత వరకు బంధువులకు అప్పగించకుండా హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

కాగా, మూడు రోజుల క్రితం ఆ మృతదేహాలు కుళ్లిపోతున్నాయని.. వాటిని భద్రపరచలేమని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యులతో మరోసారి పోస్టుమార్టం జరిపి బంధువులకు అప్పగించాలని ఆదేశించింది. ఈ నెల 23 సాయంత్రం 5 గంటల లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పింది.

దీంతో ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం ఆదివారం హైదరాబాద్ చేరుకుంంది. సోమవారం రీపోస్టుమార్టం నిర్వహించి.. సాయంత్రం 5 గంటల లోపు హైకోర్టు రిజిస్ట్రార్‌కు నివేదికను అందజేయనుంది. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. పోలీసు భద్రత నడుమ వారికి స్వగ్రామాల్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News