ఫిలింఫేర్ అవార్డ్స్... ఈ రెండు సినిమాలే టాప్

సౌత్ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం చెన్నైలో ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించి అవార్డులు ప్రకటించి అందజేసింది సదరు సంస్థ. 4 భాషల నుంచి దాదాపు వందకు పైగా చిత్రాలు పోటీపడగా.. రంగస్థలం, మహానటి సినిమాల హవా స్పష్టంగా కనిపించింది. రంగస్థలం సినిమాకు 5 అవార్డులు, మహానటి సినిమాకు 4 అవార్డులు వచ్చాయి. సౌత్ నుంచి మరే సినిమా ఈ స్థాయిలో అవార్డులు దక్కించుకోలేకపోయింది. రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర పోషించిన రామ్ చరణ్ […]

Advertisement
Update:2019-12-22 12:32 IST

సౌత్ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం చెన్నైలో ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించి అవార్డులు ప్రకటించి అందజేసింది సదరు సంస్థ. 4 భాషల నుంచి దాదాపు వందకు పైగా చిత్రాలు పోటీపడగా.. రంగస్థలం, మహానటి సినిమాల హవా స్పష్టంగా కనిపించింది. రంగస్థలం సినిమాకు 5 అవార్డులు, మహానటి సినిమాకు 4 అవార్డులు వచ్చాయి. సౌత్ నుంచి మరే సినిమా ఈ స్థాయిలో అవార్డులు దక్కించుకోలేకపోయింది.

రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర పోషించిన రామ్ చరణ్ ఉత్తమనటుడిగా, మహానటిలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తిసురేష్ ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. ఇలా ప్రతిష్టాత్మక ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు రెండూ టాలీవుడ్ కే రావడంతో.. పరిశ్రమలో సందడి నెలకొంది.

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, క్రిటిక్స్ ఛాయిస్ కింద ఉత్తమ నటుడు అవార్డుల్ని మహానటి దక్కించుకుంది. ఇక రంగస్థలం సినిమాకు… ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి (అనసూయ), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ), ఉత్తమ గీతరచయిత (చంద్రబోస్), ఉత్తమ సినిమాటోగ్రఫీ (రత్నవేలు) విభాగాల్లో అవార్డుల పంట పండింది.

Tags:    
Advertisement

Similar News