రాజధాని కమిటీతో నేడు జగన్ భేటీ.... కేపిటల్ సస్పెన్స్ కు తెరపడే చాన్స్ !
అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సీఎం జగన్ బాంబు పేల్చారు. దక్షిణాఫ్రికా లాగా ఏపీకి మూడు రాజధానులు ఉంటే బాగుంటుంది కదా? అని సభ ముందు తన అభిప్రాయం ఉంచారు. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని లేజిస్లేచర్ కేపిటల్‌గా, కర్నూలులో హైకోర్టు ఉంటే బాగుంటుంది కదా?… పరిపాల వికేంద్రీకరణ జరుగుతుంది కదా? అని ఆయన అన్నారు. అప్పటి నుంచి ఏపీకి మూడు రాజధానులు ఉంటాయనే చర్చ మొదలైంది. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత రాజధానిపై ఓ నిపుణుల కమిటీ […]
అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సీఎం జగన్ బాంబు పేల్చారు. దక్షిణాఫ్రికా లాగా ఏపీకి మూడు రాజధానులు ఉంటే బాగుంటుంది కదా? అని సభ ముందు తన అభిప్రాయం ఉంచారు.
విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని లేజిస్లేచర్ కేపిటల్‌గా, కర్నూలులో హైకోర్టు ఉంటే బాగుంటుంది కదా?… పరిపాల వికేంద్రీకరణ జరుగుతుంది కదా? అని ఆయన అన్నారు. అప్పటి నుంచి ఏపీకి మూడు రాజధానులు ఉంటాయనే చర్చ మొదలైంది.
వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత రాజధానిపై ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం
సీఎం జగన్ మోహన్‌రెడ్డిని ఈ నిపుణుల కమిటీ కలవబోతుంది. ఇప్పటికే తయారుచేసిన నివేదికను సీఎంకు అందజేసే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే ఎపికి మూడు రాజధానులు అంటూ…. సీఎం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో కమిటీ నివేదిక ఎలా ఉండబోతుంది అని అంతటా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే మద్యంతర నివేదికను నిపుణుల కమిటీ సీఎంకు ఇచ్చింది. దీంతో తుది నివేదికపై సర్వత్రా అసక్తి ఉంది. రాజధాని తరలింపు పై ఈ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుంది? అన్ని ప్రాంతాల అభివృద్దికి ఏలాంటి సూచనలు చేయనుంది?… అని రాజకీయ పార్టీలే కాదు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలు ఈ నిపుణుల కమిటీ సేకరించింది. ఇప్పటికే కొంతమంది రాజధాని రైతులు ఆందోళన బాటపట్టారు. అమరావతి నుంచి రాజధాని తరలించవద్దనేది వీరి డిమాండ్. మొత్తానికి నిపుణుల కమిటీ నివేదిక ఎలా ఉండబోతుంది? అని సాయంత్రం వరకు అందరూ వెయిట్ చేయాల్సిన పరిస్థితి.