ఏం చేయకూడదో నాకు తెలుసు

ఓ దర్శకుడిగా ఏవేవో చేస్తుంటామని చాలామంది చెబుతుంటారు. కానీ కేఎస్ రవికుమార్ మాత్రం దీనికి రివర్స్ లో చెబుతున్నారు. తనకు ఏం చేయకూడదో బాగా తెలుసంటున్నారు. అసిస్టెంట్ డైరక్టర్ గా పదేళ్లు పనిచేశానని, ఆ టైమ్ లో మూవీ మేకింగ్ కు సంబంధించి ఏం చేయకూడదో తెలుసుకున్నానని తెలిపారు. “డైరక్టర్ కాకముందు పదేళ్లు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాను. ఆ టైమ్ లో చాలా నేర్చుకున్నాను. మరీ ముఖ్యంగా ఎలా తీయకూడదో తెలుసుకున్నాను. మూలాలు తెలుసుకున్నారు. ఆరోజు […]

Advertisement
Update:2019-12-20 07:06 IST

ఓ దర్శకుడిగా ఏవేవో చేస్తుంటామని చాలామంది చెబుతుంటారు. కానీ కేఎస్ రవికుమార్ మాత్రం దీనికి రివర్స్ లో చెబుతున్నారు. తనకు ఏం చేయకూడదో బాగా తెలుసంటున్నారు. అసిస్టెంట్ డైరక్టర్ గా పదేళ్లు పనిచేశానని, ఆ టైమ్ లో మూవీ మేకింగ్ కు సంబంధించి ఏం చేయకూడదో తెలుసుకున్నానని తెలిపారు.

“డైరక్టర్ కాకముందు పదేళ్లు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాను. ఆ టైమ్ లో చాలా నేర్చుకున్నాను. మరీ ముఖ్యంగా ఎలా తీయకూడదో తెలుసుకున్నాను. మూలాలు తెలుసుకున్నారు. ఆరోజు ఏ సీన్ తీయాలో, ఎలా తీయాలో టార్గెట్ పెట్టుకున్నాను. వర్షం వచ్చి షూటింగ్ ఆగిపోతే ఏం చేయాలో తెలుసుకున్నాను. వీలైనంత తొందరగా సినిమాలు ఎలా
పూర్తిచేయాలో తెలుసుకున్నాను. ఆ మూలాలు తెలుసుకున్నాను కాబట్టే రూలర్ సినిమాను 65 రోజుల్లో పూర్తిచేయగలిగాను. లేదంటే 6 నెలలు చేయాల్సిన సినిమా ఇది.”

అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే తనకు కోపం వచ్చేస్తుందంటున్నారు రవికుమార్. ఇదే లక్షణం బాలయ్యలో కూడా చూశానంటున్నారు. తమకు ఎవరి మీద కోపం, ద్వేషం ఉండవని ఆ క్షణానికి అది వస్తుందని, తర్వాత పోతుందని చెప్పుకొచ్చాడు. ఆయన డైరక్ట్ చేసిన రూలర్ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News