బ్రేకింగ్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడంటే...
సీఎం కేసీఆర్ తెలంగాణలో మరో ఎన్నికలకు తెరలేపారు. హుజూర్ నగర్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఆయన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుపడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. తెలంగాణలో ఈ సంక్రాంతి తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి కేసీఆర్ సర్కారు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణ మున్సిపాలిటీల్లో 3149 వార్డుల విభజన పూర్తి చేశారు ఇప్పటికే వార్డుల విభజన, ఓటర్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు అభ్యంతరాలను పూర్తి చేసింది. రిజర్వేషన్లపై కసరత్తు […]
సీఎం కేసీఆర్ తెలంగాణలో మరో ఎన్నికలకు తెరలేపారు. హుజూర్ నగర్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఆయన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుపడానికి డిసైడ్ అయినట్లు సమాచారం.
తెలంగాణలో ఈ సంక్రాంతి తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి కేసీఆర్ సర్కారు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
తెలంగాణ మున్సిపాలిటీల్లో 3149 వార్డుల విభజన పూర్తి చేశారు ఇప్పటికే వార్డుల విభజన, ఓటర్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు అభ్యంతరాలను పూర్తి చేసింది. రిజర్వేషన్లపై కసరత్తు చేస్తోంది.
ఈ డిసెంబర్ చివరి వారంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడానికి ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. జనవరి నెలాఖరు వరకూ మున్సిపల్ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఫిబ్రవరిలో కొత్త పాలకమండళ్లు కొలువుదీరనున్నాయి.