యువతకు ఉపాధి కోసం.... ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీలు

ఏపీ సీఎం జగన్ యువతకు ఉపాధి కల్పించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాష్ట్రంలోని యువతకు స్కిల్ డెవలప్ మెంట్ పై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తిరుపతిలో స్కిల్ […]

Advertisement
Update:2019-12-19 06:11 IST

ఏపీ సీఎం జగన్ యువతకు ఉపాధి కల్పించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

బుధవారం రాష్ట్రంలోని యువతకు స్కిల్ డెవలప్ మెంట్ పై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తిరుపతిలో స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ కిందే ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు నడవాలని… యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించడం వీటి బాధ్యత అని జగన్ తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని… పారదర్శకంగా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని జగన్ ఆదేశించారు.

ఇందుకు గాను ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజీ లేదా రెండు కాలేజీలు ఏర్పాటు చేసే ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సాంకేతిక కోర్సులు నేర్పించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News