రాజధాని దెబ్బ... చంద్రబాబుకు కేఈ షాక్
ఏపీలో విశాఖ, అమరావతి, కర్నూలును అభివృద్ధి చేస్తామన్న జగన్ ప్రకటనపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆయన సామాజికవర్గం నేతలు, అమరావతిలో భూములు కొన్న వారు విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తే…. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతంలో రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిసినా… అమరావతి కోసం చంద్రబాబు వాటిని లెక్కచేయడంలేదు. అయితే చంద్రబాబు […]
ఏపీలో విశాఖ, అమరావతి, కర్నూలును అభివృద్ధి చేస్తామన్న జగన్ ప్రకటనపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబుతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆయన సామాజికవర్గం నేతలు, అమరావతిలో భూములు కొన్న వారు విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తే…. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతంలో రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిసినా… అమరావతి కోసం చంద్రబాబు వాటిని లెక్కచేయడంలేదు. అయితే చంద్రబాబు తీరుపై అప్పుడే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ టీడీపీలోనే సెగలు మొదలయ్యాయి.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ … ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే స్వాగతించారు. దాంతో గంటాపై టీడీపీ మీడియా ఎదురుదాడి మొదలుపెట్టింది. పార్టీ వీడి వెళ్లేందుకు ఇదే సాకుగా గంటా భావిస్తున్నారంటూ కథనాలు రాస్తోంది.
తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి కూడా జగన్ నిర్ణయానికి జై కొట్టారు. జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు కేఈ ప్రకటించారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు మంచి నిర్ణయమన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని… కాబట్టి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తొలి నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారని కేఈ గుర్తు చేశారు. కేఈ, గంటా దారిలోనే మరికొందరు టీడీపీ నేతలు వారి ప్రాంతాల కోసం గళమెత్తే అవకాశం కనిపిస్తోంది.