యధావిధిగా ఐపీఎల్ 2020 వేలం
పౌరసత్వ సవరణ బిల్లుతో అట్టుడుకుతున్న కోల్ కతా డిసెంబర్ 19న కోల్ కతాలో ఐపీఎల్ వేలం హంగామా కోల్ కతా వేదికగా మరికొద్ది గంటల్లో నిర్వహించాల్సిన ఐపీఎల్ 2020 వేలం యధావిధిగా జరుగుతుందని ఐపీఎల్ కౌన్సిల్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పౌరసత్వసవరణ బిల్లుకు వ్యతిరేకంగా కోల్ కతాలో వ్యతిరేక ప్రదర్శనలతో నిరసన చెలరేగే ప్రమాదం ఉంది. నిరసన ప్రదర్శనలకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా నాయకత్వం వహిస్తుండడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. దీంతో కోల్ కతాలో తొలిసారిగా […]
- పౌరసత్వ సవరణ బిల్లుతో అట్టుడుకుతున్న కోల్ కతా
- డిసెంబర్ 19న కోల్ కతాలో ఐపీఎల్ వేలం హంగామా
కోల్ కతా వేదికగా మరికొద్ది గంటల్లో నిర్వహించాల్సిన ఐపీఎల్ 2020 వేలం యధావిధిగా జరుగుతుందని ఐపీఎల్ కౌన్సిల్ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు పౌరసత్వసవరణ బిల్లుకు వ్యతిరేకంగా కోల్ కతాలో వ్యతిరేక ప్రదర్శనలతో నిరసన చెలరేగే ప్రమాదం ఉంది. నిరసన ప్రదర్శనలకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా నాయకత్వం వహిస్తుండడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. దీంతో కోల్ కతాలో తొలిసారిగా జరగాల్సిన ఐపీఎల్ 2020 వేలం ప్రశ్నార్థకంగా మారింది.
అయితే…వివిధ ఫ్రాంచైజీలకు చెందిన బృందాలు ఇప్పటికే కోల్ కతా నగరానికి తరలి వచ్చాయి. మరికొన్ని బృందాలు కొద్ది గంటల్లో కోల్ కతా చేరుకొనే అవకాశం ఉందని బోర్డు వర్గాలుప్రకటించాయి.
73 స్థానాల కోసం వేలం..
లీగ్ లోని మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు…73 స్థానాల భర్తీకిమాత్రమే పోటీపడబోతున్నాయి. మొత్తం 332 మంది స్వదేశీ, విదేశీ క్రికెటర్ల జాబితాతో వేలం నిర్వహించబోతున్నారు.
డిసెంబర్ 19న జరిగే ఈ వేలంలో కనీస వేలం ధరను 50 లక్షల రూపాయలుగాను, గరిష్టంగా 2 కోట్ల రూపాయలుగాను నిర్ణయించారు.
వేలం జాబితాలో చోటు సంపాదించిన మొత్తం 332 మంది ఆటగాళ్లలో ఆతిథ్య భారత్ కు చెందిన 186 మంది ఆటగాళ్లుండటం విశేషం.
వీరిలో 134మంది అంతర్జాతీయ క్రికెటర్లు, 198 మంది దేశవాళీ క్రికెటర్లు ఉన్నారు.
ఆస్ట్ర్రేలియా నుంచి 35 మంది…
ఆస్ట్ర్రేలియాకు చెందిన మొత్తం 35 మంది క్రికెటర్లు వేలంలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. గ్లెన్ మాక్స్ వెల్, పాట్ కమిన్స్, మిషెల్ మార్ష్ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో పోటీకి దిగుతున్నారు.
సౌతాఫ్రికాకు చెందిన 23, ఇంగ్లండ్ కు చెందిన 22, వెస్టిండీస్ 19, న్యూజిలాండ్ 18, శ్రీలంక 14, అప్ఘనిస్థాన్ 7, బంగ్లాదేశ్ 5, అమెరికా, యూఏఈ, స్కాట్లాండ్ దేశాలకు చెందిన ఒక్కో ఆటగాడికి వేలం తుదిజాబితాలో చోటు దక్కింది.
మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 29 మంది విదేశీ క్రికెటర్ల స్థానాలను భర్తి చేసుకోవాల్సి ఉంది.