ఇళ్ల నిర్మాణంలో రూ. 2,626 కోట్ల దోపిడి

గత ప్రభుత్వ హయాంలో పేదల గృహ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్‌లో ఒక్కో ఇంటికి 75వేల రూపాయలు ఆదా చేశామన్నారు. చంద్రబాబు నిర్ణయం కారణంగా ఇల్లు నిర్మించుకున్న పేదలు 20ఏళ్ల పాటు బ్యాంకు రుణం కట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అవగానే పేదలపై ఆ భారాన్ని పూర్తిగా తప్పించారన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల 150 కోట్ల రూపాయలు ఆదా అయిందన్నారు. గత […]

Advertisement
Update:2019-12-16 04:55 IST

గత ప్రభుత్వ హయాంలో పేదల గృహ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్‌లో ఒక్కో ఇంటికి 75వేల రూపాయలు ఆదా చేశామన్నారు.

చంద్రబాబు నిర్ణయం కారణంగా ఇల్లు నిర్మించుకున్న పేదలు 20ఏళ్ల పాటు బ్యాంకు రుణం కట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అవగానే పేదలపై ఆ భారాన్ని పూర్తిగా తప్పించారన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల 150 కోట్ల రూపాయలు ఆదా అయిందన్నారు.

గత ప్రభుత్వం 3లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టులో రూ. 2వేల 626 కోట్లు దోపిడి చేసిందని బొత్స ఆరోపించారు. ఐదేళ్లలో ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని బొత్స వివరించారు.

Tags:    
Advertisement

Similar News