ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్.... స్వగ్రామంలో కలకలం

చదువుకునే సమయంలో పరిచయమైన ఒక యువతిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఉన్నతోద్యోగం దక్కగానే ఆమెను మోసం చేసిన ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిని కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే… కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లెకు చెందిన మహేశ్వర్‌రెడ్డి సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 126వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. దీంతో అతని గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. అప్పట్లో అతడు సివిల్స్ ఎంపిక కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా అభినందనల్లో […]

Advertisement
Update:2019-12-15 06:03 IST

చదువుకునే సమయంలో పరిచయమైన ఒక యువతిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఉన్నతోద్యోగం దక్కగానే ఆమెను మోసం చేసిన ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిని కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది.

వివరాల్లోకి వెళితే… కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లెకు చెందిన మహేశ్వర్‌రెడ్డి సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 126వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. దీంతో అతని గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. అప్పట్లో అతడు సివిల్స్ ఎంపిక కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా అభినందనల్లో ముంచెత్తారు.

కాగా, సివిల్స్ కంటే ముందు ఉస్మానియా క్యాంపస్‌లో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో భావన అనే యువతి పరిచయం అయ్యింది. వాళ్లిద్దరి మధ్య ప్రేమ కాస్తా పెళ్లికి దారితీసింది. అప్పట్లోనే ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు.

అయితే మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత భావనను దూరం పెట్టసాగాడు. తనకు మంచి సంబంధాలు వస్తున్నాయని.. ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదని…. దూరం పెట్టసాగాడు. ఇంతలో అతను ఐపీఎస్ ట్రైనింగ్‌కు వెళ్లాడు.

దీంతో తాను మోసపోయానని గ్రహించిన భావన జవహర్‌నగర్ పోలీసులకు ఆధారాలతో సహా పిర్యాదు చేసింది. అంతే కాకుండా కేంద్ర హోం శాఖకు కూడా పిర్యాదు చేసింది. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టిన కేంద్ర హోం శాఖ అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది.

జాతీయ స్థాయిలో ర్యాంకు తెచ్చుకొని ఐపీఎస్‌గా ఎంపికైన మహేశ్వర్‌రెడ్డి శిక్షణా కాలంలోనే సస్పెన్షన్ వేటుకు గురవడం అతడి గ్రామంలో కలకం సృష్టించింది. శిక్షణ మధ్యలోనే తన భవితవ్యం ప్రశ్నార్థకరంగా మారడంతో ఇకపై ఏమి జరుగనుందో? అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News