నేపాల్‌లో ఘోర ప్రమాదం.... 12 మంది దుర్మరణం
నేపాల్‌లోని సింధు పాల్ చౌక్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా… మరి కొంత మంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం సింధుపాల్‌చౌక్ జిల్లా కాలిన్ చౌక్ మందిరం నుంచి 40 మంది యాత్రికులతో ఒక బస్సు బయలుదేరింది. డోలాఖా ఖాదీచౌర్-జిరి రోడ్డులో ఉన్న ఘాట్ రోడ్డులో అదుపు తప్పి 500 మీటర్ల లోతులో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడికక్కడే మరణించగా.. పదుల సంఖ్యలో […]
నేపాల్‌లోని సింధు పాల్ చౌక్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా… మరి కొంత మంది గాయాలపాలయ్యారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం సింధుపాల్‌చౌక్ జిల్లా కాలిన్ చౌక్ మందిరం నుంచి 40 మంది యాత్రికులతో ఒక బస్సు బయలుదేరింది. డోలాఖా ఖాదీచౌర్-జిరి రోడ్డులో ఉన్న ఘాట్ రోడ్డులో అదుపు తప్పి 500 మీటర్ల లోతులో పడిపోయింది.
దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడికక్కడే మరణించగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లంతా కాలిన్ చౌక్ మందిరం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సహకారంతో లోయలో నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకొని వస్తున్నారు. గాయాల పాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.