వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణకు ఆది డిమాండ్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణకు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. వివేకా హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చిన్న సంబంధం ఉందని తేలినా బహిరంగంగా ఉరి తీయించుకునేందుకు సిద్ధమని సవాల్ చేశారు. వివేకా కేసులో సిట్ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని… రేపు విచారణకు హాజరవుతానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకా హత్య కేసుపై సిట్ వద్దు…. సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేసిన వైసీపీ ఇప్పుడు […]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణకు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. వివేకా హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
చిన్న సంబంధం ఉందని తేలినా బహిరంగంగా ఉరి తీయించుకునేందుకు సిద్ధమని సవాల్ చేశారు.
వివేకా కేసులో సిట్ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని… రేపు విచారణకు హాజరవుతానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకా హత్య కేసుపై సిట్ వద్దు…. సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేసిన వైసీపీ ఇప్పుడు ఎందుకు మాట మార్చిందని ప్రశ్నించారు.
సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు హంతకులు ఎవరన్నది బయటకు వస్తుందని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.