ట్రయిలర్ ఎఫెక్ట్.... ఓవర్సీస్ ను ఉచితంగా ఇచ్చేశారు.... ఇక్కడ మాత్రం....

రూలర్ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసినప్పుడే ట్రోలింగ్ షురూ అయింది. తాజాగా ట్రయిలర్ వచ్చిన తర్వాత ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. బాలయ్య గెటప్, ట్రయిలర్ కట్ పై లెక్కలేనన్ని రిమార్క్స్ పడ్డాయి. దీంతో రూలర్ బిజినెస్ డల్ అయిపోయింది. ఎంతలా అంటే, సినిమాను 15 కోట్ల రూపాయల నష్టానికి వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ ను ఉచితంగా ఇచ్చేశారు. ఓవర్సీస్ లో బాలయ్య మార్కెట్ పూర్తిగా పడిపోవడంతో, డబ్బులొస్తే చూసుకుందాం అనే […]

Advertisement
Update:2019-12-11 07:30 IST

రూలర్ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసినప్పుడే ట్రోలింగ్ షురూ అయింది. తాజాగా ట్రయిలర్ వచ్చిన తర్వాత ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. బాలయ్య గెటప్, ట్రయిలర్ కట్ పై లెక్కలేనన్ని రిమార్క్స్ పడ్డాయి. దీంతో రూలర్ బిజినెస్ డల్ అయిపోయింది. ఎంతలా అంటే, సినిమాను 15 కోట్ల రూపాయల నష్టానికి వదులుకోవాల్సి వచ్చింది.

ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ ను ఉచితంగా ఇచ్చేశారు. ఓవర్సీస్ లో బాలయ్య మార్కెట్ పూర్తిగా పడిపోవడంతో, డబ్బులొస్తే చూసుకుందాం అనే విధంగా రైట్స్ ఇచ్చేశారు. ఇక పూర్తిగా తెలుగు రాష్ట్రాల బిజినెస్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి.

ఇలాంటి టైమ్ లో ట్రయిలర్ దెబ్బ కొట్టడంతో బయ్యర్లు ఎవ్వరూ భారీ రేట్లకు ముందుకురాలేదు. ఒక దశలో సి.కల్యాణ్ ఆస్థాన బయ్యర్లు కూడా వెనక్కు తగ్గడంతో మూవీ విడుదలపై అయోమయం నెలకొంది.

దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య 15 కోట్ల నష్టానికే ఏపీ, నైజాం థియేట్రికల్ బిజినెస్ పూర్తిచేశారు. బాలయ్య సినిమా సూపర్ హిట్ అయి, లాభాలు ఓవర్ ఫ్లోస్ వస్తే అప్పుడు నిర్మాతలకు ఏమైనా మిగులుతుంది. లేదంటే నష్టమే.

Tags:    
Advertisement

Similar News