సినిమాకు రాజకీయ రంగు పులమొద్దు.. పవన్ సంచలన వ్యాఖ్యలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజమండ్రిలో నిర్వహించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు రామ్ చరణ్ ఎంత ఎదిగినా కొద్ది ఒదిగి ఉండటం నేర్చుకోవాలని అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన ఎవరూ మూలాలు మర్చిపోకూడదని అన్నారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు తాను ఇంటర్ చదువుతున్నానని.. రామ్ చరణ్‌కు ఆ పేరు పెట్టింది మా నాన్న అని గుర్తుచేసుకున్నారు. హనుమంతుడిలా ఉండాలని రామ్ చరణ్‌కు ఆ పేరు పెట్టారని తెలిపారు. అది రామ్ చరణ్‌లో కనిపిస్తోందని.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడని, తన శక్తి సామర్థ్యం ఏంటో కూడా తనకు తెలియదని అన్నారు. రామ్ చరణ్ నాకు తమ్ముడి లాంటి వాడని చెప్పుకొచ్చారు. చాలా బాధ్యతగా ఉంటాడని తెలిపారు. రంగస్థలం సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని అనుకున్నా.. కానీ ఏదో రోజు తప్పకుండా జాతీయ అవార్డు సాధిస్తాడనే నమ్మకం ఉందని అన్నారు.
మెగా స్టార్ చిరంజీవి మూలంగా ఇవాళ తామంతా మంచి స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఆయన ఎంతో కష్టపడి మా అందరినీ ఈ స్థాయిలో ఉండేలా చేశాడని అన్నారు. తమ కుటుంబ బాధ్యతను తీసుకొని.. సుఖం లేకుండా రాత్రుళ్లు కూడా ఎంతో కష్టపడి షూస్ విప్పకుండానే పడుకునే వాడని అన్నారు. ఆయన్ని అలా చూశాడు.. కాబట్టి జీవితాంతం ఒదిగే ఉంటాడని అన్నారు. చిత్ర పరిశ్రమలకు రాజకీయాలు పూయడం మాకు ఇష్టం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అభిమానులంతా క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరారు. అందరూ బాగుండాలని అన్నారు. హీరో రామ్ చరణ్ మాట్లాడుతు సినిమా మీద, సినీ పరిశ్రమ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ఇవాళ రాజమండ్రిలో ఈ జనసముద్రాన్ని చూస్తుంటే, నాడు పవన్ కల్యాణ్ ఇదే రాజమండ్రిలో మొదటిసారి నిర్వహించిన ర్యాలీ గుర్తుకొస్తోందని అన్నారు. "రాజమండ్రిలో గేమ్ చేంజర్ షూటింగ్ ను చాలా రోజుల పాటు చేశాం. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినందుకు పవన్ కల్యాణ్‌రకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.