హిందూ ధర్మానికి కేసీఆర్ పెనుముప్పు- బీజేపీ
ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా బీజేపీ మతం కార్డును గట్టిగానే నమ్ముకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా మతపరమైన విమర్శలు చేస్తోంది. కేసీఆర్ హిందూ ధర్మానికి పెనుముప్పుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. యాదాద్రిలో వరుసగా అపచారాలకు పాల్పడుతున్నారని… చివరకు స్వామి మూలవిరాట్‌కే భంగం కలిగించారని ఫైర్ అయ్యారు. స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామినే ఉలితో చెక్కేశారని, ఆలయ ప్రాకార స్తంబాలపై ఆ మధ్య ఏకంగా సీఎం శిల్పాలనే చెక్కారని…. బీజేపీ ఆందోళనతో వెనక్కు తగ్గారని […]
ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా బీజేపీ మతం కార్డును గట్టిగానే నమ్ముకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా మతపరమైన విమర్శలు చేస్తోంది. కేసీఆర్ హిందూ ధర్మానికి పెనుముప్పుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు.
యాదాద్రిలో వరుసగా అపచారాలకు పాల్పడుతున్నారని… చివరకు స్వామి మూలవిరాట్‌కే భంగం కలిగించారని ఫైర్ అయ్యారు. స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామినే ఉలితో చెక్కేశారని, ఆలయ ప్రాకార స్తంబాలపై ఆ మధ్య ఏకంగా సీఎం శిల్పాలనే చెక్కారని…. బీజేపీ ఆందోళనతో వెనక్కు తగ్గారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ మరో ఘజనీ మహమ్మద్‌లా మారారని… యాదాద్రిలో శాంతిరూపంలో ఉన్న స్వామిని ఉగ్రరూపంగా మార్చారని లక్ష్మణ్ విమర్శించారు. యాదాద్రిలో ఆలయం మీద కంటే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే కేసీఆర్‌కు ఎక్కువ దృష్టి ఉందని ఆరోపించారు. గుడి నిర్మాణానికి ముందే యాదాద్రి చుట్టూ నేతలు పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారని, వాటి ధరలు పెంచుకోవడానికే ఈ వ్యవహారం నడుపుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.
తరచూ యాగాలు చేస్తూ స్వామిజీలకు పాదాభివందనాలు చేస్తూ ఉండే కేసీఆర్ వల్ల హిందూ ధర్మానికి ముప్పు అని బీజేపీ నేతలంటున్నారంటే… ఇక బీజేపీ మినహా ఇతర పార్టీల్లో ఉన్న నాయకులందరినీ హిందూ ద్రోహులుగా చిత్రీకరించినా ఆశ్చర్యం లేదని కొందరంటున్నారు.