శాఫ్ గేమ్స్ 5వ రోజునా భారత్ అదేజోరు

81 స్వర్ణాలతో సహా 165 పతకాలు 13వ దక్షిణాసియా దేశాల క్రీడల ఐదవరోజునా భారత్ పతకాల వేట అప్రతిహతంగా కొనసాగింది. తన బంగారు పతకాల సంఖ్యను 81కు పెంచుకొంది. మొత్తం 165 పతకాలతో …పతకాల పట్టిక అగ్రభాగంలో నిలిచింది. ఖట్మండూ, ఫోక్రా నగరాలు వేదికగా జరుగుతున్న ఈ గేమ్స్ 5వ రోజున జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల సింగిల్స్ లో భారత ప్లేయర్లు క్లీన్ స్వీప్ సాధించారు. పురుషుల, మహిళల సింగిల్స్ బంగారు పతకం మ్యాచ్ లు భారత […]

Advertisement
Update:2019-12-07 02:40 IST
  • 81 స్వర్ణాలతో సహా 165 పతకాలు

13వ దక్షిణాసియా దేశాల క్రీడల ఐదవరోజునా భారత్ పతకాల వేట అప్రతిహతంగా కొనసాగింది. తన బంగారు పతకాల సంఖ్యను 81కు పెంచుకొంది. మొత్తం 165 పతకాలతో …పతకాల పట్టిక అగ్రభాగంలో నిలిచింది.

ఖట్మండూ, ఫోక్రా నగరాలు వేదికగా జరుగుతున్న ఈ గేమ్స్ 5వ రోజున జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల సింగిల్స్ లో భారత ప్లేయర్లు క్లీన్ స్వీప్ సాధించారు.

పురుషుల, మహిళల సింగిల్స్ బంగారు పతకం మ్యాచ్ లు భారత ప్లేయర్ల మధ్యనే సాగడం విశేషం.

పురుషుల సింగిల్స్ టైటిల్ ను సిరిల్ వర్మ గెలుచుకొని బంగారు పతకం అందుకొన్నాడు. ఫైనల్లో భారత్ కే చెందిన ఆర్యమన్ టాండన్ ను 17-21, 23-21, 21-13తో సిరిల్ వర్మ అధిగమించాడు.

మహిళల సింగిల్స్ బంగారు పతకం పోటీలో అష్మిత చాలిహా 21-18, 25-23తో గాయత్రీ గోపీచంద్ ను ఓడించింది. పురుషుల, మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ అంశాలలో సైతం స్వర్ణ, రజత పతకాలు భారత ప్లేయర్లేకే దక్కాయి.

ట్రాక్ అండ్ ఫీల్డ్ లో 2 స్వర్ణాలు

అథ్లెటిక్స్ లో భారత అథ్లెట్లు మరో రెండు బంగారు పతకాలు సాధించారు. పురుషుల, మహిళల షాట్ పుట్ త్రో విభాగంలో రెండుకు రెండు బంగారు పతకాలు భారత అథ్లెట్లే సాధించారు.

టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల సింగిల్స్ బంగారు పతకాలను భారత ప్లేయర్లు ఆంథోనీ అమల్ రాజ్, సుత్రితా ముఖర్జీ కైవసం చేసుకొన్నారు.

5వ రోజున భారత్ కు 41 పతకాలు

పోటీల రెండోరోజునుంచి పతకాలు సాధించడంలో జోరు పెంచుతూ వచ్చిన భారత్…5వ రోజు పోటీలలో మరో 41 పతకాలు గెలుచుకొంది. ఇందులో 19 స్వర్ణ, 18 రజత, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.

భారత్ ఓవరాల్ గా 81 స్వర్ణాలు, 59 రజత, 25 కాంస్యాలతో సహా మొత్తం 165 పతకాలతో పతకాల పట్టిక అగ్రస్థానంలో నిలిచింది.

ఆతిథ్య నేపాల్ 41 స్వర్ణాలతో సహా 116 పతకాలతో రెండు, శ్రీలంక 23 స్వర్ణాలతో సహా 134 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

డిసెంబర్ 10న 2019 శాఫ్ గేమ్స్ కు తెరపడనుంది. శాప్ సూపర్ పవర్ భారత్ 200కు పైగా పతకాలు సాధించే అవకాశాలు లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News