పవన్ తిట్ల వెనుక అసలు రహస్యం ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి పట్టుమని ఆరునెలలు కూడా కాకముందే ప్రతిపక్షనేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు… జగన్ సర్కారు టార్గెట్ గా ముందుకెళ్తున్నారు. చంద్రబాబు ఆడపా దడపా కాసింత విరామం ఇస్తున్నా.. అమావాస్యకు, పౌర్ణమికి మాత్రమే కనపడి పార్ట్ టైం పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీలో విస్తృతంగా పర్యటిస్తూ వైఎస్ జగన్ పై పరుష విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో నటిస్తున్నాడని.. ఆయనకు 450 […]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి పట్టుమని ఆరునెలలు కూడా కాకముందే ప్రతిపక్షనేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు… జగన్ సర్కారు టార్గెట్ గా ముందుకెళ్తున్నారు.
చంద్రబాబు ఆడపా దడపా కాసింత విరామం ఇస్తున్నా.. అమావాస్యకు, పౌర్ణమికి మాత్రమే కనపడి పార్ట్ టైం పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీలో విస్తృతంగా పర్యటిస్తూ వైఎస్ జగన్ పై పరుష విమర్శలు చేస్తున్నారు.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో నటిస్తున్నాడని.. ఆయనకు 450 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చాడని మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్ చేశారు. వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ వెనుకున్నది చంద్రబాబు అని విమర్శిస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఆమధ్య ఢిల్లీ వెళ్లి రహస్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసాడని.. ఆ తర్వాత ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం తర్వాతే పవన్ లో స్పష్టమైన మార్పు వచ్చిందంటున్నారు.
పవన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీలో చేరిపోతారని.. అమిత్ షాతో డీల్ కుదిరాకే ఇలా జగన్ ను టార్గెట్ చేసుకున్నారనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. మరి ఇది ఎంతవరకూ నిజమో వేచిచూడాలి.