గన్నవరంలో వంశీకి లైన్ క్లియర్.... యార్లగడ్డకు కీలక పదవి !
గన్నవరంలో రాజీ కుదిరింది. వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావును జిల్లా సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ గా నియమించారు. దీంతో వల్లభనేని వంశీకి లైన్ క్లియర్ అయింది. టీడీపీకి గుడ్ బై చెప్పిన వంశీ సీఎం జగన్ వెంట నడుస్తానని స్పష్టం చేశారు.కొత్త ఏడాదిలో వైసీపీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంశీ రాకను యార్లగడ్డ వ్యతిరేకించారు. ఈక్రమంలోనే వైసీపీ నేతలు కథ నడిపించారు. వంశీ వైసీపీలో చేరకముందే యార్లగడ్డ కు కేడీసీసీ పగ్గాలు అప్పగించారు. దీనిద్వారా […]
గన్నవరంలో రాజీ కుదిరింది. వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావును జిల్లా సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ గా నియమించారు. దీంతో వల్లభనేని వంశీకి లైన్ క్లియర్ అయింది.
టీడీపీకి గుడ్ బై చెప్పిన వంశీ సీఎం జగన్ వెంట నడుస్తానని స్పష్టం చేశారు.కొత్త ఏడాదిలో వైసీపీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంశీ రాకను యార్లగడ్డ వ్యతిరేకించారు.
ఈక్రమంలోనే వైసీపీ నేతలు కథ నడిపించారు. వంశీ వైసీపీలో చేరకముందే యార్లగడ్డ కు కేడీసీసీ పగ్గాలు అప్పగించారు. దీనిద్వారా గన్నవరంలో వంశీ రాకకు లైన్‌క్లియర్ చేశారు. రాబోయే రోజుల్లో యార్లగడ్డకు ఆప్కాబ్ ఛైర్మన్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలే సీఎం జగన్‌ను రెండు సార్లు కలిశారు. పార్టీలో చేరికపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లోపు టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెడుతారని ప్రచారం జరుగుతోంది. దాదాపు ఆరు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమని ప్రత్యేక గ్రూపుగా చూడాలని స్పీకర్ కోరుతారని తెలుస్తోంది.
దీంతో ఈ రెండు మూడు రోజుల్లోనే వల్లభనేని వంశీతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలు గ్రూపుగా ఏర్పడుతారని తెలుస్తోంది. వీరికి మరింత మంది జత కడతారని చెబుతున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు కూడా ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.