ఐటీ దాడులు.. వెంకీమామ వాయిదా?

వెంకీమామకు మరో అడ్డంకి. ఎన్నో తేదీలు పరిశీలించిన తర్వాత ఫైనల్ గా డిసెంబర్ 13న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. రేపోమాపో ఆ తేదీని అధికారికంగా ప్రకటిస్తారని అనుకున్న టైమ్ లో, ఊహించని విధంగా సురేష్ బాబు ఇంటిపై, రామానాయుడు స్టుడియోస్ పై ఐటీ దాడులు జరిగాయి. ఈ ప్రభావం సినిమా విడుదలపై కూడా పడిందని, అనుకున్న టైమ్ కు వెంకీ మామ రాకపోవచ్చంటున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను క్రిస్మస్ కు విడుదల చేయాలనుకున్నారు. […]

Advertisement
Update:2019-11-24 08:46 IST

వెంకీమామకు మరో అడ్డంకి. ఎన్నో తేదీలు పరిశీలించిన తర్వాత ఫైనల్ గా డిసెంబర్ 13న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. రేపోమాపో ఆ తేదీని అధికారికంగా ప్రకటిస్తారని అనుకున్న టైమ్ లో, ఊహించని విధంగా సురేష్ బాబు ఇంటిపై, రామానాయుడు స్టుడియోస్ పై ఐటీ దాడులు జరిగాయి. ఈ ప్రభావం సినిమా విడుదలపై కూడా పడిందని, అనుకున్న టైమ్ కు వెంకీ మామ రాకపోవచ్చంటున్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను క్రిస్మస్ కు విడుదల చేయాలనుకున్నారు. ఒక దశలో సంక్రాంతి బరిలో నిలపాలని కూడా భావించారు. కానీ అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరక్కపోవడంతో.. ఎటూ తేల్చుకోలేకపోయారు. ఫైనల్ గా వెంకీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఆదాయపు పన్నుశాఖ సోదాలతో ఈ సినిమా విడుదల డైలమాలో పడిందని అంటున్నారు.

బాబి దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కింది వెంకీ మామ సినిమా. పాయల్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేసుకొని రెడీగా ఉంది. తాజాగా నాగచైతన్య ఈ సినిమా చూశాడు. ఔట్ పుట్ పై పూర్తి సంతృప్తి వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ల్యాబ్ కే పరిమితమైన ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News