చింతమనేనిని ఆదర్శకంగా తీసుకోండి " పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

టీడీపీ చిత్తుగా ఓడిపోవడానికి పది కారణాలతో జాబితాను సిద్ధం చేస్తే అందులో చింతమనేని ప్రభాకర్‌ విచ్చలవిడి తనం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. తహసీల్దార్ వనజాక్షిని చింతమనేని ప్రభాకర్ ఇసుకలో పడేసికొట్టిన అంశం టీడీపీ విధానాలను ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంది. ఇంత జరిగినా చంద్రబాబు మాత్రం తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపించడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, మహిళలు, దళితులు, చివరకు పోలీసులను కొట్టినా జైలుకు వెళ్లకుండా చింతమనేని తప్పించుకున్నారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత […]

Advertisement
Update:2019-11-19 04:32 IST

టీడీపీ చిత్తుగా ఓడిపోవడానికి పది కారణాలతో జాబితాను సిద్ధం చేస్తే అందులో చింతమనేని ప్రభాకర్‌ విచ్చలవిడి తనం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. తహసీల్దార్ వనజాక్షిని చింతమనేని ప్రభాకర్ ఇసుకలో పడేసికొట్టిన అంశం టీడీపీ విధానాలను ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంది. ఇంత జరిగినా చంద్రబాబు మాత్రం తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపించడం లేదు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, మహిళలు, దళితులు, చివరకు పోలీసులను కొట్టినా జైలుకు వెళ్లకుండా చింతమనేని తప్పించుకున్నారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో వరుస కేసులతో చింతమనేని జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి ఇటీవలే విడుదలయ్యాడు.

జైలు నుంచి వచ్చిన చింతమనేనిని చంద్రబాబునాయుడు పరామర్శించాడు. చింతమనేని లాంటి ప్రజానాయకుడిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించాడు. చింతమనేని ప్రభాకర్‌ను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని చంద్రబాబు సూచించాడు.

ఇంగ్లీష్‌ మీడియంకు వ్యతిరేకంగా గళమెత్తితే ప్రభుత్వం మాత్రం పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు ప్రశ్నించాడు. తన దగ్గరకు వస్తే వరదల్లో కూడా ఇసుక తీసే పరిజ్ఞానం నేర్పిస్తానని చంద్రబాబు చెప్పారు.

సిగ్గుందా.. రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకోవాలా?

చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించడంపై దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి స్పందించారు. 62 కేసులతో పాటు రౌడీషీట్ ఉన్న చింతమనేనిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు.

చింతమనేనిపై నమోదైన కేసులన్నీ టీడీపీ హయాంలోనివేనని.. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై చర్యలు లేకుండా చింతమనేని తప్పించుకుని తిరుగుతూ వచ్చారని అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

చింతమనేని నడిపిన ఇసుక మాఫియా సంపాదనలో టీడీపీ పెద్దలకు వాటా వెళ్లేదని… అందుకే చింతమనేనిని చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News