పవన్ నీవు మెయిన్ విలన్ కూడా కాదు... బాబు పక్కన సైడ్ విలన్‌వి...
పవన్ కల్యాణ్ ఇటీవల రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. కర్నూలులో హైకోర్టుకు సహకరించాలని రాయలసీమవారు పవన్ కల్యాణ్‌కు వినతి పత్రం ఇస్తే… దానిపై చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. పులివెందుల్లో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోండి అంటూ హేళనగా మాట్లాడడం పవన్ కల్యాణ్‌కు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఏమో ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు మాట్లాడవచ్చు.. తాము తిరిగి సమాధానం ఇస్తే మాత్రం తప్పా అని ప్రశ్నించారు. సినిమాల్లో హీరోగా […]
పవన్ కల్యాణ్ ఇటీవల రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. కర్నూలులో హైకోర్టుకు సహకరించాలని రాయలసీమవారు పవన్ కల్యాణ్‌కు వినతి పత్రం ఇస్తే… దానిపై చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. పులివెందుల్లో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోండి అంటూ హేళనగా మాట్లాడడం పవన్ కల్యాణ్‌కు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ ఏమో ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు మాట్లాడవచ్చు.. తాము తిరిగి సమాధానం ఇస్తే మాత్రం తప్పా అని ప్రశ్నించారు. సినిమాల్లో హీరోగా ఉంటూ… రాజకీయాల్లో విలన్ పాత్ర పోషిస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇంటికి పెళ్లికి వెళ్లాను అంటూ పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు చూస్తుంటే తనకే సిగ్గేస్తోందన్నారు.
వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉంటే ఒకరి ఇళ్లకు మరొకరు శుభకార్యాలకు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హద్దు అదుపులేకుండా ఏపీలో మాట్లాడుతున్నది పవన్ కల్యాణే అని విమర్శించారు. పదేపదే తాటా తీస్తా… తోలు తీస్తా… కాళ్లు ఇరగ్గొడుతా వంటి మాటలు దేనికి సంకేతం అని నిలదీశారు. ఇలాంటి మాటలను తిరిగి సమాధానం ఇస్తే ఇంటికి వస్తా… తాటా తీస్తా అంటూ మాట్లాడడం ఏ సంస్కారం అని ప్రశ్నించారు.
అంత ప్రజాబలం ఉన్న వ్యక్తి అయితే పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడిపోయిన పవన్ కల్యాణ్… 151 స్థానాల్లో పార్టీని గెలిపించిన జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. చిరంజీవి లేకుంటే పవన్ కల్యాణ్ ఎక్కడుండేవారని నిలదీశారు. రాజకీయాల్లో కనీసం పెద్ద విలన్ కూడా కాకుండా… సైడ్ విలన్ అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రధాన విలన్ చంద్రబాబు, బుడ్డ విలన్ లోకేష్ అయితే పవన్ కల్యాణ్ వారి మధ్యలో సైడ్ విలన్‌గా ఉంటారన్నారు. చంద్రబాబుకు తెల్లగడ్డం ఉంటే లోకేష్‌కు అసలు బుర్రే ఉండదని… పవన్ కల్యాణ్‌కు నల్ల గడ్డం ఉంటుందని… ఒకే ఫ్రేమ్‌లో ఈ ముగ్గురిని చూస్తే భలే ముచ్చటగా ఉంటుందన్నారు.
కూల్‌డ్రింక్ కంపెనీకి అంబాసిడర్‌గా ఉంటే చాలా డబ్బులు వచ్చేవని… కానీ దాన్ని తిరస్కరించానని పవన్ కల్యాణ్ చెబుతున్నారని… కానీ టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ బాగానే గిట్టుబాటు చేసుకుంటున్నట్టుగా ఉందని అంబటి విమర్శించారు.