రిలీజ్ కు ముందే రూ.50 కోట్లు లాభం

స్టార్ హీరోల సినిమాలకు ఉండే ఎడ్వాంటేజ్ ఇదే. డబ్బులు రావనే బెంగ ఉండదు. ఇంకా చెప్పాలంటే రిలీజ్ కు ముందే లాభాలు వెనకేసుకోవచ్చు. జీరో రిస్క్ తో మార్కెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాకు సంబంధించి ఇలాంటి పరిస్థితినే ఎంజాయ్ చేస్తున్నాడు నిర్మాత, సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్. డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాతో అప్పుడే 50 కోట్ల లాభం ఆర్జించినట్టు ప్రకటించాడు. ప్రొడక్షన్ విలువ – రూ. 80 కోట్లు మార్కెటింగ్ […]

Advertisement
Update:2019-11-04 15:44 IST

స్టార్ హీరోల సినిమాలకు ఉండే ఎడ్వాంటేజ్ ఇదే. డబ్బులు రావనే బెంగ ఉండదు. ఇంకా చెప్పాలంటే రిలీజ్ కు ముందే లాభాలు వెనకేసుకోవచ్చు. జీరో రిస్క్ తో మార్కెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాకు సంబంధించి ఇలాంటి పరిస్థితినే ఎంజాయ్ చేస్తున్నాడు నిర్మాత, సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్. డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాతో అప్పుడే 50 కోట్ల లాభం ఆర్జించినట్టు ప్రకటించాడు.

ప్రొడక్షన్ విలువ – రూ. 80 కోట్లు
మార్కెటింగ్ కాస్ట్ – రూ. 25 కోట్లు
టోటల్ బడ్జెట్ – రూ. 105 కోట్లు

శాటిలైట్ రైట్స్ – రూ. 80 కోట్లు (జీ నెట్ వర్క్)
డిజిటల్ రైట్స్ – రూ. 60 కోట్లు (అమెజాన్ ప్రైమ్)
మ్యూజిక్ రైట్స్ – రూ. 15 కోట్లు (టీ సిరీస్)
నాన్-థియేట్రికల్ రెవన్యూ – రూ. 155 కోట్లు

ఇలా సినిమా బిజినెస్ మొత్తాన్ని బయటపెట్టాడు అర్బాజ్ ఖాన్. టోటల్ బడ్జెట్ ను మినహాయిస్తే.. నాన్-థియేట్రికల్ రైట్స్ కిందే మూవీ లాభాల బాట పట్టిందని వెల్లడించాడు. ఇక సల్మాన్ సినిమాలు థియేటర్లలో మినిమం వంద కోట్లు కలెక్ట్ చేస్తాయనే సంగతి తెలిసిందే. సినిమా హిట్ అయితే కళ్లుచెదిరే వసూళ్లు వస్తాయి. సో.. దబంగ్ 3కి నిర్మాతలు ఏరేంజ్ లో లాభాలు అందుకోబోతున్నారో ఊహించుకోండి.

Tags:    
Advertisement

Similar News