వ్యాపార వేత్తకు ఎయిర్‌ హోస్టెస్‌ వల... భర్తతో కలిసి బ్లాక్‌ మెయిలింగ్‌ !

ఆమె పేరు కనిష్క. చేసే ఉద్యోగం ఎయిర్‌ హోస్టెస్‌. అందాన్ని పెట్టుబడిగా పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరురాలు కావాలని కలలుకన్నది. అందుకు భర్త విజయ్‌కుమార్‌ కూడా సై అన్నాడు. అసలే ఎయిర్‌ హోస్టెస్‌. పైగా అందగత్తె. బడా బాబులకు గాలం వేసే పనిలో పడింది. అయితే అమె వలలో నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త పడ్డాడు. ఇంకేముంది హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. రిసార్టులు.. హోటళ్లు… పబ్బులు… ఇద్దరు తెగ ఎంజాయ్‌ చేశారు. దాదాపు మూడు […]

Advertisement
Update:2019-10-31 07:57 IST

ఆమె పేరు కనిష్క. చేసే ఉద్యోగం ఎయిర్‌ హోస్టెస్‌. అందాన్ని పెట్టుబడిగా పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరురాలు కావాలని కలలుకన్నది. అందుకు భర్త విజయ్‌కుమార్‌ కూడా సై అన్నాడు.

అసలే ఎయిర్‌ హోస్టెస్‌. పైగా అందగత్తె. బడా బాబులకు గాలం వేసే పనిలో పడింది. అయితే అమె వలలో నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త పడ్డాడు. ఇంకేముంది హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. రిసార్టులు.. హోటళ్లు… పబ్బులు… ఇద్దరు తెగ ఎంజాయ్‌ చేశారు.

దాదాపు మూడు నెలలపాటు ఇద్దరు సరదాగా గడిపారు. కనిష్క వ్యాపారవేత్తతో చనువుగా ఉన్న సమయంలో ఆమె భర్త విజయ్‌కుమార్‌ ఫోటోలు తీయడం… వీడియోలు రికార్టు చేయడం వంటివి చేశాడు.

ఓరోజు ఇద్దరు శంషాబాద్‌ సమీపంలోని ఓ రిసార్టుకు వెళ్లారు. అయితే తనను ట్రాప్‌ చేసిన సంగతి తెలియని సదరు వ్యాపారికి… ఆమె మత్తుమందు ఇచ్చింది. ఇక సీన్‌లోకి ఎంటర్‌ అయిన భర్త విజయ్‌కుమార్‌ అక్కడ సినిమా సన్నివేశాన్ని క్రియేట్‌ చేశాడు. ఫర్నీచర్‌ ధ్వంసం చేశాడు. కనిష్కను రక్తం వచ్చేలా కొట్టి స్వల్పంగా గాయపరిచాడు. స్పృహలోకి వచ్చిన వ్యాపారితో విజయ్‌కుమార్‌ గొడవపడ్డాడు. తన భార్యతో గడిపి సరసమాడుతావా అంటూ బెదిరించాడు. ఓ దశలో పిస్టల్‌తో బెదిరించాడు.

దీంతో భయపడిపోయిన సదరు వ్యాపారి స్పాట్‌కు 20 లక్షలు తెప్పించి వారికి ఇచ్చాడు. దాంతోపాటు… మరో కోటి రూపాయలకు బాండ్‌ పేపర్‌ కూడా రాయించుకోవడంతో తనకేమీ కాదని సైలెంట్‌ అయ్యాడు.

అయితే విజయ్‌కుమార్‌ నుంచి మరిన్ని డబ్బులు కావాలని బెదిరింపులు రావడంతో… బాధితుడు శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హానీ దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే ఈ కిలాడీ లేడి వలలో ఓ ఎన్నారై కూడా పడ్డట్టు తేలింది. వీరి జాదూకు మరికొందరు వ్యాపార వేత్తలు బలైనట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

Tags:    
Advertisement

Similar News