ఖైదీ మొదటి వారాంతం వసూళ్లు

కార్తి హీరోగా నటించిన సినిమా ఖైదీ. లోకేష్ కనకరాజ్ డైరక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఫాదర్ సెంటిమెంట్, డ్రగ్ మాఫియాను మిక్స్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక తెలుగులో కూడా ఖైదీ హంగామా తక్కువగా ఏం లేదు. విడుదలైన మొదటి రోజు ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల్ని షాక్ కు గురిచేసింది. వాళ్లు ఇచ్చిన మౌత్ టాక్ […]

Advertisement
Update:2019-10-28 17:30 IST

కార్తి హీరోగా నటించిన సినిమా ఖైదీ. లోకేష్ కనకరాజ్ డైరక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఫాదర్ సెంటిమెంట్, డ్రగ్ మాఫియాను మిక్స్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక తెలుగులో కూడా ఖైదీ హంగామా తక్కువగా ఏం లేదు. విడుదలైన మొదటి రోజు ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల్ని షాక్ కు గురిచేసింది. వాళ్లు ఇచ్చిన మౌత్ టాక్ తో శని, ఆదివారాలు ఖైదీ ఊపందుకుంది.

మొదటి రోజు ఖైదీ సినిమాకు కేవలం 30 లక్షల రూపాయల షేర్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి సినిమాకు 3 రోజులు గడిచేసరికి ఏకంగా కోటి 76 లక్షల రూపాయల షేర్ వచ్చిందంటే.. మౌత్ టాక్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా 3 రోజులు తిరిగేసరికి సూపర్ హిట్ తెచ్చుకుంది ఖైదీ. ఎట్టకేలకు టాలీవుడ్ లో కార్తికి ఓ హిట్ దొరికింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 0.52 కోట్లు
సీడెడ్ – రూ. 0.33 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.24 కోట్లు
ఈస్ట్ – రూ. 0.12 కోట్లు
వెస్ట్ – రూ. 0.10 కోట్లు
గుంటూరు – రూ. 0.15 కోట్లు
నెల్లూరు – రూ. 0.08 కోట్లు
కృష్ణా – రూ. 0.22 కోట్లు

Tags:    
Advertisement

Similar News