విజిల్ మీద ఖైదీదే పైచేయి

ఈ దీపావళికి తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలే టాలీవుడ్ లో పోటీపడిన విషయాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం. నిజంగానే ఆ రెండు సినిమాల మధ్య మంచి పోటీ నడిచింది. అయితే తెలుగు వరకు వచ్చేసరికి ఓపెనింగ్స్ విజయ్ సినిమాకు వచ్చినప్పటికీ.. గెలుపు మాత్రం కార్తి సొంతమైంది. విజయ్ నటించిన విజిల్ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 65 లక్షల రూపాయల షేర్ వచ్చింది. కార్తి నటించిన ఖైదీకి మాత్రం ఏపీ, నైజాంలో కేవలం […]

Advertisement
Update:2019-10-26 07:17 IST

ఈ దీపావళికి తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలే టాలీవుడ్ లో పోటీపడిన విషయాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం. నిజంగానే ఆ రెండు సినిమాల మధ్య మంచి పోటీ నడిచింది. అయితే తెలుగు వరకు వచ్చేసరికి ఓపెనింగ్స్ విజయ్ సినిమాకు వచ్చినప్పటికీ.. గెలుపు మాత్రం కార్తి సొంతమైంది.

విజయ్ నటించిన విజిల్ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 65 లక్షల రూపాయల షేర్ వచ్చింది. కార్తి నటించిన ఖైదీకి మాత్రం ఏపీ, నైజాంలో కేవలం 30 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. అలా అని విజిల్ హిట్ అయినట్టు కాదు, ఖైదీ ఫ్లాప్ అయినట్టు కూడా కాదు.

గతంలో విజయ్ నటించిన 2-3 సినిమాలు తెలుగులో కూడా బాగానే ఆడాయి. సేమ్ టైం కార్తి నటించిన 2-3 సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయ్యాయి. అందుకే విజయ్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాగా, కార్తి సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు. కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే.. విజిల్ కంటే ఖైదీనే బాగుంది. టాలీవుడ్ లో లాంగ్ రన్ లో నిలబడేది ఖైదీ మాత్రమే.

సో.. ప్రస్తుతానికి ఖైదీకి వసూళ్లు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. ఇవాళ్టి నుంచి ఈ సినిమా ఊపందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలా ఎట్టకేలకు తెలుగులో కార్తి ఓ హిట్ కొట్టాడు.

Tags:    
Advertisement

Similar News