బాలయ్య, రవితేజ.. దొందూ దొందే

ఇదేదో సెటైరిక్ గా పెట్టిన హెడ్డింగ్ కాదు. తమ అప్ కమింగ్ మూవీస్ లో ఇద్దరూ పోలీస్ ఆఫీసర్లగానే కనిపిస్తున్నారు. పైగా క్యారెక్టరైజేషన్లు కూడా దాదాపు ఒకటే. అవును.. బాలయ్య కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టారు. పోలీసాఫీసర్ ధర్మ గెటప్ లో ఉన్న లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ క్యారెక్టర్ రౌడీకి తక్కువ, పోలీస్ కు ఎక్కువ అన్నట్టు ఉంటుందట. చేతిలో […]

Advertisement
Update:2019-10-26 11:44 IST

ఇదేదో సెటైరిక్ గా పెట్టిన హెడ్డింగ్ కాదు. తమ అప్ కమింగ్ మూవీస్ లో ఇద్దరూ పోలీస్ ఆఫీసర్లగానే కనిపిస్తున్నారు. పైగా క్యారెక్టరైజేషన్లు కూడా దాదాపు ఒకటే. అవును.. బాలయ్య కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టారు. పోలీసాఫీసర్ ధర్మ గెటప్ లో ఉన్న లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ క్యారెక్టర్ రౌడీకి తక్కువ, పోలీస్ కు ఎక్కువ అన్నట్టు ఉంటుందట. చేతిలో సుత్తి చూస్తేనే మేటర్ అర్థమైపోతుంది.

సరిగ్గా ఇలాంటి క్యారెక్టరైజేషన్ తోనే సినిమా ప్రకటించాడు రవితేజ. కెరీర్ లో తన 66వ చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో కలిసి చేయబోతున్నాడు ఈ హీరో. దీపావళి కానుకగా ఈరోజు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందులో రవితేజ కూడా పోలీస్. అది కూడా కాస్త తిక్కతో కూడుకున్న పోలీస్ పాత్ర. అందుకే ఈ సినిమాకు క్రాక్ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు.

బాలయ్య సినిమాను డిసెంబర్ 20న విడుదలకు సిద్ధం చేశారు. సరిగ్గా అదే టైమ్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. రూలర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సోనాల్ చౌహాన్ ను, తన క్రాక్ సినిమాలోకి తీసుకోవాలనుకుంటున్నాడు రవితేజ. ఇలా ఈ రెండు సినిమాల మధ్య చాలానే పోలికలున్నాయి మరి.

Tags:    
Advertisement

Similar News