తెలుగుతెరపై తమిళ పోరు
టాలీవుడ్ లో ఇలాంటి విచిత్రాలు కొత్త కాదు. పిల్లి-పిల్లి కొట్టుకొని కోతికి లబ్ది చేకూర్చినట్టు.. నిర్మాతలంతా జుట్టు పట్టుకొని తమిళ సినిమాలకు దారివ్వడం చాలాసార్లు చూశాం. అలాంటి పరిస్థితే ఈసారి కూడా ఎదురైంది. ఓవైపు రిలీజ్ డేట్స్ దొరకడం లేదని, సరైన మార్కెట్ కండిషన్స్ లేవంటూ బీద అరుపులు అరుస్తూనే.. రెండు తమిళ సినిమాలకు చోటిచ్చారు తెలుగు నిర్మాతలు. నిజానికి మార్కెట్లో మంచి సినిమా లేదు. సైరా వచ్చి 4 వారాలైంది. దాని ఆక్యుపెన్సీ పెద్దగా లేదు. […]
టాలీవుడ్ లో ఇలాంటి విచిత్రాలు కొత్త కాదు. పిల్లి-పిల్లి కొట్టుకొని కోతికి లబ్ది చేకూర్చినట్టు.. నిర్మాతలంతా జుట్టు పట్టుకొని తమిళ సినిమాలకు దారివ్వడం చాలాసార్లు చూశాం. అలాంటి పరిస్థితే ఈసారి కూడా ఎదురైంది. ఓవైపు రిలీజ్ డేట్స్ దొరకడం లేదని, సరైన మార్కెట్ కండిషన్స్ లేవంటూ బీద అరుపులు అరుస్తూనే.. రెండు తమిళ సినిమాలకు చోటిచ్చారు తెలుగు నిర్మాతలు.
నిజానికి మార్కెట్లో మంచి సినిమా లేదు. సైరా వచ్చి 4 వారాలైంది. దాని ఆక్యుపెన్సీ పెద్దగా లేదు. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో రాజుగారి గది 3 మినహా మరే సినిమా ఆడే స్థితిలో లేదు. అది కూడా బి, సి సెంటర్లకే పరిమితమైంది. ఇలాంటి టైమ్ లో తెలుగు సినిమాలకు ఇది మంచి టైమింగ్. పైగా దీపావళి వీకెండ్ కూడా వస్తోంది. కానీ మనోళ్లు మాత్రం ఈ తేదీని రెండు తమిళ సినిమాలకు వదిలేశారు.
ఈ వీకెండ్ కార్తి నటించిన ఖైదీ, విజయ్ నటించిన విజిల్ సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలుగా బరిలోకి దిగుతున్నాయి. తెలుగులో బాక్సాఫీస్ పోటీ ఈ రెండు తమిళ సినిమాల మధ్యనే ఉండబోతోంది. వీటితో పాటు 2 తెలుగు సినిమాలు కూడా వస్తున్నాయి. వీటిలో ఒకటి తుపాకిరాముడు కాగా, ఇంకోటి వనవాసం ఈ రెండు సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలా మన తెలుగు నిర్మాతలు మరో వీకెండ్ ను తమిళ సినిమాలకు ధారాదత్తం చేశారు.