‘రాజు గారి గది-3’ సినిమా రివ్యూ

రివ్యూ : రాజు గారి గది-3 రేటింగ్ : 1.5/5 తారాగణం : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, బ్రహ్మాజీ, ఊర్వశి, అజయ్ ఘోష్, ప్రభాస్ శ్రీను, హరితేజ, ధనరాజ్ తదితరులు సంగీతం : షబీర్ నిర్మాతలు : ఓంకార్, అశ్విన్, కళ్యాణ్ దర్శకత్వం : ఓంకార్ ‘రాజు గారి గది’ సిరీస్ లోని మొదటి భాగం మంచి హిట్ అయినప్పటికీ…. నాగార్జున, సమంత వంటి స్టార్లు నటించిన ‘రాజు గారి గది 2’ మాత్రం ప్రేక్షకులను […]

Advertisement
Update:2019-10-18 12:16 IST

రివ్యూ : రాజు గారి గది-3
రేటింగ్ : 1.5/5
తారాగణం : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, బ్రహ్మాజీ, ఊర్వశి, అజయ్ ఘోష్, ప్రభాస్ శ్రీను, హరితేజ, ధనరాజ్ తదితరులు
సంగీతం : షబీర్
నిర్మాతలు : ఓంకార్, అశ్విన్, కళ్యాణ్

దర్శకత్వం : ఓంకార్

‘రాజు గారి గది’ సిరీస్ లోని మొదటి భాగం మంచి హిట్ అయినప్పటికీ…. నాగార్జున, సమంత వంటి స్టార్లు నటించిన ‘రాజు గారి గది 2’ మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సిరీస్ లోని మూడవ భాగమైన ‘రాజు గారి గది 3’ సినిమా తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు ఓంకార్. తన తమ్ముడు అశ్విన్ బాబు ని హీరోగా ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్ ని హీరోయిన్ గా పెట్టి తీసిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది.

కథ:

అశ్విని (అశ్విన్ బాబు) ఒక ఆటో డ్రైవర్. ప్రతిరోజు తనుండే కాలనీలో ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటాడు. మరోవైపు మాయా (అవికా గోర్) కి ఎవరు ప్రపోజ్ చేసినా వాళ్ళు దుష్ట శక్తులకి బలి అవుతూ ఉంటారు. ఇది తెలుసుకున్న కాలనీ వాళ్లు అశ్విన్ తో మాయ కి ప్రపోజ్ చేయించాలని అనుకుంటారు. అశ్విన్ మాయ తో ప్రేమలో పడి ఆమె కి ప్రపోజ్ కూడా చేస్తాడు.

కానీ అప్పటి నుంచి అతని జీవితం తలకిందులు అయిపోతుంది. తన జీవితంలో భయానక అనుభవాలన్నీ ఎదురవుతూ ఉంటాయి. అసలు ఇంతకీ ఈ మాయ ఎవరు? తనకి ప్రపోజ్ చేసిన వారిని ఎందుకు దుష్ట శక్తులు పీడిస్తాయి? అశ్విన్, దుష్ట శక్తి మధ్య ఎవరు గెలిచారు? చివరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ.

నటీనటులు:

అశ్విన్ బాబు నటన ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. మిగతా రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అశ్విన్ బాబు పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉంది. తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించాడు అశ్విన్. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అతని నటన సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది అని చెప్పవచ్చు.

ఇప్పటిదాకా అందమైన గ్లామరస్ పాత్రలలో కనిపించిన అవికా గోర్ ఈ సినిమాలో హారర్ సన్నివేశాల్లో చాలా బాగా నటించింది. గ్లామర్ తో మాత్రమే కాక నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించింది అవికా.

అలీ తన పాత్రకి న్యాయం చేశాడు. బ్రహ్మాజీ తన పాత్ర లో ఒదిగిపోయి బాగా నటించాడు. అజయ్ ఘోష్ చాలా సహజంగా నటించాడు. ప్రభాస్ శీను, హరితేజ మరియు ధనరాజ్ ల కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

కేవలం హారర్ సన్నివేశాలతో కథను ముందుకు తీసుకెళ్లడం మాత్రమే కాక… దర్శకుడు ఓంకార్ తన సినిమాలో ఒక బలమైన కథ ఉండేలా కూడా చూసుకుంటారు. కానీ ఈ సినిమాలో అంత మంచి కథ లేకపోవడంతో…. కేవలం ఎంటర్ టైన్ మెంట్ తో నడిపించాడు.

కథని ప్రెజెంట్ చేసే విధానం బావుంది… కానీ చూసిన కథనే మళ్ళీ చూస్తున్నంత బోర్ కొడుతుంది. కామెడీ మరియు హారర్ సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు ఓంకార్. ముఖ్యంగా కొన్ని కామెడీ సన్నివేశాలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

షబ్బీర్ అందించిన సంగీతం సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. అతని కెమెరా యాంగిల్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. గౌతం రాజు ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. సాయి మాధవ్ బుర్ర అందించిన డైలాగులు ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి.

బలాలు:

నటీనటులు, నేపధ్య సంగీతం, కామెడీ

బలహీనతలు:

బలమైన కథ లేకపోవడం, హారర్ సన్నివేశాలు

చివరి మాట:

ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ సినిమాకి ఒక బలమైన కథ లేకపోవడం మైనస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సన్నివేశాలతో నే గడిచిపోతుంది. కొంత స్లో గా ఉండడంతో ప్రేక్షకులకు బాగా బోర్ కొడుతుంది. సినిమా ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగా వచ్చింది. ఇక ప్రథమార్థం తో పోల్చుకుంటే ద్వితీయార్థం కొంచెం బెటర్ గా మారుతుంది. హారర్ సన్నివేశాలు పెద్దగా లేకపోయినా కామెడీ బావుంటుంది. ముఖ్యంగా 20 నిమిషాల పాటు బంగ్లా లో జరిగే కామెడీ సీన్ అయితే సినిమాకి హైలైట్. కామెడీ బాగానే పడినప్పటికీ హారర్ సన్నివేశాలు మరీ అంతగా భయపెట్టక పోవడం కొంచెం నిరాశ కలిగిస్తుంది. అంతేకాకుండా దర్శకుడు కథని మలచిన విధానం కూడా చాలా స్లో గా ఉంది. చివరిగా ‘రాజు గారి గది 3’ ప్రేక్షకులను బాగానే అలరించలేకపోయింది అని చెప్పవచ్చు.

బాటమ్ లైన్:

ఏమాత్రం భయపెట్టలేకపోయిన ‘రాజు గారి గది 3’.

Tags:    
Advertisement

Similar News