కోడెల కుమారుడికి కోటి జరిమానా

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం గడిచిన ఐదేళ్లలో సాగించిన అక్రమాలు అన్ని ఇన్నీ కావు. తోపుడు బండ్ల నుంచి రైల్వే కాంట్రాక్టర్ల వరకు మామూళ్లు వసూలు చేశాడు. ఇసుక దోపిడి నుంచి వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ వరకు ఆయన చేయని అక్రమాలు లేవనే చెప్పాలి. గుంటూరులో గౌతమ్ ఆటోమోటివ్‌ పేరుతో షోరూం నిర్వహించారు ఈయన. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండగా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా […]

Advertisement
Update:2019-10-16 00:29 IST

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం గడిచిన ఐదేళ్లలో సాగించిన అక్రమాలు అన్ని ఇన్నీ కావు. తోపుడు బండ్ల నుంచి రైల్వే కాంట్రాక్టర్ల వరకు మామూళ్లు వసూలు చేశాడు.

ఇసుక దోపిడి నుంచి వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ వరకు ఆయన చేయని అక్రమాలు లేవనే చెప్పాలి. గుంటూరులో గౌతమ్ ఆటోమోటివ్‌ పేరుతో షోరూం నిర్వహించారు ఈయన. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండగా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా తన షోరూంలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించాడు. ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లేలా చేశాడు.

టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కోడెల శివరాం షోరూం పై ఫిర్యాదులు వచ్చాయి. వాటిని విచారించిన కొత్త ప్రభుత్వం అక్రమాలను గుర్తించింది. ఇప్పటికే షోరూంను సీజ్ చేశారు అధికారులు. చేసిన అక్రమాల ఆధారంగా గౌతమ్ షోరూంకు కోటి రూపాయల జరిమానాను ఆర్‌టీఏ అధికారులు విధించారు. అక్రమాలు రుజువైనందున జరిమానా విధించినట్టు రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News