జార్జిరెడ్డి బయోపిక్ ట్రైలర్....

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో 1960 నుంచి 1970 వరకు చదివిన వారిలో జార్జిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. కాలేజీ లో జరిగే పాలిటిక్స్ మరియు పక్షపాతానికి ఎదురు తిరిగిన మొట్టమొదటి స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి. ఇప్పుడు అతనిపై ఒక బయోపిక్ రానుంది. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ సినిమాలో నటించిన సందీప్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈచిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు […]

Advertisement
Update:2019-10-08 06:37 IST

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో 1960 నుంచి 1970 వరకు చదివిన వారిలో జార్జిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. కాలేజీ లో జరిగే పాలిటిక్స్ మరియు పక్షపాతానికి ఎదురు తిరిగిన మొట్టమొదటి స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి.

ఇప్పుడు అతనిపై ఒక బయోపిక్ రానుంది. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ సినిమాలో నటించిన సందీప్ హీరోగా నటిస్తున్నాడు.

తాజాగా ఈచిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ట్రైలర్ చూస్తే సినిమా జార్జిరెడ్డి చిన్నతనం నుంచి అతని జీవితం గురించి చెప్పనుందని తెలుస్తోంది.

చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఇష్టంతో పెరిగిన జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లో ఒక స్టూడెంట్ లీడర్ గా ఎలా ఎదిగాడు, ఆ తర్వాత అతని జీవితం ఎలా మారింది, పక్షపాతానికి జార్జిరెడ్డి ఎలా ఎదురుతిరిగాడు, చివరికి అదే కాలేజీలో… 1972 లో అతి దారుణంగా అతనిని ఎలా హత్య చేశారు అనే విషయాలు సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది.

సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో మనోజ్ నందన్, శత్రు, మహతి మరియు దేవిక ముఖ్య పాత్రలు పోషిస్తుండగా సత్యదేవ్ క్యామియో పాత్రలో కనిపించనున్నాడు.

Tags:    
Advertisement

Similar News