మూడు హత్యల టిక్‌టాక్ "విలన్" ఆత్మహత్య
టిక్‌టాక్ వ్యసనం మరో వ్యక్తిని బలి తీసుకుంది. యూపికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తుపాకీతో తనకు తాను కాల్చుకున్నాడు. యూపిలోని బిజ్నోర్కు చెందిన 30 ఏళ్ల అశ్విన్ కుమార్ టిక్‌టాక్‌లో తనకు తాను విలన్ అని ప్రకటించుకుని వీడియోలు పెట్టేవాడు. ఎఫ్‌బీలోనూ అదే తరహా పోస్టులు పెట్టేవాడు. తనను తాను విలన్‌గా చెప్పుకుంటూ ”దయ్యం రెడీగా ఉంది… ఇప్పుడు నేను సృష్టించే విలయం చూడండి” అంటూ వ్యాఖ్యలు చేసేవాడు. తొలుత టిక్‌టాక్ వీడియోల వరకే […]
టిక్‌టాక్ వ్యసనం మరో వ్యక్తిని బలి తీసుకుంది. యూపికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తుపాకీతో తనకు తాను కాల్చుకున్నాడు. యూపిలోని బిజ్నోర్కు చెందిన 30 ఏళ్ల అశ్విన్ కుమార్ టిక్‌టాక్‌లో తనకు తాను విలన్ అని ప్రకటించుకుని వీడియోలు పెట్టేవాడు. ఎఫ్‌బీలోనూ అదే తరహా పోస్టులు పెట్టేవాడు.
తనను తాను విలన్‌గా చెప్పుకుంటూ ”దయ్యం రెడీగా ఉంది… ఇప్పుడు నేను సృష్టించే విలయం చూడండి” అంటూ వ్యాఖ్యలు చేసేవాడు. తొలుత టిక్‌టాక్ వీడియోల వరకే విలన్ అనుకున్నా… అతడు నిజజీవితంలోనూ మూడు హత్యలు చేసినట్టు ఇటీవల పోలీసులు గుర్తించారు.
ఇటీవల స్థానిక బీజేపీ నేత కుమారుడిని, మరో బంధువుని అశ్విన్ తుపాకీతో కాల్చి చంపాడు. తన మాట వినలేదని మరో అమ్మాయిని కూడా హత్య చేశాడు. ఈ మూడు హత్యలకు అశ్వినే కారణమని గుర్తించిన పోలీసులు అతడి కోసం వేట మొదలుపెట్టారు. దాంతో బెదిరిపోయిన అశ్విన్ కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తొలుత ఢిల్లీకి పారిపోయేందుకు బస్సు ఎక్కిన అతడు అనంతరం దారి మధ్యలో బస్సు దిగి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టిక్‌టాక్ ప్రభావం వల్లే అతడి మానసిక స్థితి కూడా దెబ్బతిన్నట్టు భావిస్తున్నారు.