క్రీడామంత్రి పదవి శిక్ష కానేకాదు- కిరణ్ రిజ్జూ

విజేతలకు ఎప్పటికప్పుడే నగదు బహుమతులు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లో…కేంద్ర క్రీడామంత్రి పదవిని…ఎక్కువమంది ఓ శిక్షగా, ఎందుకూ కొరగాని పదవిగా భావిస్తారని… అయితే తాను మాత్రం పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు కిరణ్ రిజ్జూ తేల్చిచెప్పారు. తనకు క్రీడామంత్రి పదవీ బాధ్యతలు అప్పజెప్పిన ప్రధాని నరేంద్ర మోడీకి రుణపడి ఉంటానని ప్రకటించారు. చాంపియన్లు రాత్రికిరాత్రే పుట్టుకురారు… క్రీడలు ఏవైనా.. ప్రపంచ చాంపియన్లను రాత్రికి రాత్రే తయారు చేయలేమని..వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం సంవత్సరాల తరబడి కృషి చేస్తేనే విశ్వవిజేతలు పుట్టుకువస్తారని క్రీడామంత్రి తెలిపారు. […]

Advertisement
Update:2019-10-07 00:32 IST
  • విజేతలకు ఎప్పటికప్పుడే నగదు బహుమతులు

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లో…కేంద్ర క్రీడామంత్రి పదవిని…ఎక్కువమంది ఓ శిక్షగా, ఎందుకూ కొరగాని పదవిగా భావిస్తారని… అయితే తాను మాత్రం పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు కిరణ్ రిజ్జూ తేల్చిచెప్పారు. తనకు క్రీడామంత్రి పదవీ బాధ్యతలు అప్పజెప్పిన ప్రధాని నరేంద్ర మోడీకి రుణపడి ఉంటానని ప్రకటించారు.

చాంపియన్లు రాత్రికిరాత్రే పుట్టుకురారు…

క్రీడలు ఏవైనా.. ప్రపంచ చాంపియన్లను రాత్రికి రాత్రే తయారు చేయలేమని..వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం సంవత్సరాల తరబడి కృషి చేస్తేనే విశ్వవిజేతలు పుట్టుకువస్తారని క్రీడామంత్రి తెలిపారు.

2013 నుంచి కొందరు క్రీడాకారులకు ప్రోత్సాహక నగదుబహుమతులు అందని సంగతి తనకు తెలియదని…తాను క్రీడామంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. ప్రపంచ, అంతర్జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రోత్సాహక నగదు బహుమతులు అందేలా చర్యలు తీసుకొన్నట్లు చెప్పారు.

ఇటీవలే ముగిసిన ప్రపంచ కుస్తీ, బాక్సింగ్ విజేతలతో పాటు…ప్రపంచ చాంపియన్ గా నిలిచిన సింధును సైతం సాదరంగా ఆహ్వానించి…సగౌరవంగా సత్కరించి మరీ.. నగదు చెక్కులను అందచేసిన విషయాన్ని కిరణ్ రిజ్జూ గుర్తు చేశారు.

దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేకపోడం దురదృష్టకరమని…క్రికెట్లో మాత్రమే ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ సదుపాయాలు, స్టేడియాలు ఉండటం నిజమేనని క్రీడామంత్రి ఒప్పుకొన్నారు. అయితే…క్రికెటేతర క్రీడలకు సైతం గతంలోకంటే ప్రస్తుతం అధికప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News