సైరా: అమెరికా లో బ్రేక్ ఈవెన్ ఎంత అంటే...

‘సైరా నరసింహారెడ్డి’ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2 న విడుదలైన సంగతి తెలిసిందే. గాంధీ జయంతి సందర్భంగా సెలవు కూడా వచ్చింది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ స్టామినా బాక్సాఫీస్ వద్ద క్లియర్ గా కనిపిస్తుంది. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగానే ఉండటంతో ఈ సినిమా కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కలిపి 116 కోట్లు వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలే కాకుండా […]

Advertisement
Update:2019-10-04 09:18 IST

‘సైరా నరసింహారెడ్డి’ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2 న విడుదలైన సంగతి తెలిసిందే. గాంధీ జయంతి సందర్భంగా సెలవు కూడా వచ్చింది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ స్టామినా బాక్సాఫీస్ వద్ద క్లియర్ గా కనిపిస్తుంది. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగానే ఉండటంతో ఈ సినిమా కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కలిపి 116 కోట్లు వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు వస్తున్నాయి.

ఇటు తెలుగు రాష్ట్రాలే కాకుండా అమెరికాలో కూడా సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభించాయి. కేవలం ప్రీమియర్ షో లతోనే సైరా సినిమా వన్ మిలియన్ క్లబ్ లోకి చేరుకోవడం విశేషం. ఇక ఓవర్సీస్ మార్కెట్ నుంచి సినిమా 20 కోట్లు సులువుగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమెరికా లో మొదటిరోజు (ప్రీమియర్స్ తో కలిపి) సైరా యూఎస్ లో 1.15 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది ఈ సినిమా. ఇక రెండో రోజు వసూళ్ల విషయానికి వస్తే అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 9.45 నిమిషాలకు 256 లొకేషన్స్ నుండి $102,213 వసూలు చేసింది ఈ సినిమా. 3.5 మిలియన్ నుండి 4 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తే ఈ సినిమా అమెరికా లో హిట్ స్టేటస్ సంపాదిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టం ఏమీ కాదు అనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News