ప్రత్యేక విమానం తిరస్కరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలకు కొత్త గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తన వంతు సహకారం అందిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాధనం వృథా కాకుండా చేపట్టిన పొదుపు చర్యలకు గవర్నర్ కూడా మద్దతుగా నిలిచారు. తన కోసం ప్రభుత్వం పెట్టే వ్యక్తిగత ఖర్చులను, దుబారాను తగ్గించుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాన్ని ఆయన తిరస్కరించారు. రాష్ట్ర గవర్నర్‌ హోదాలో ఆయన పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తుంది.. కానీ అందుకు ఆయన వద్దు అనేశారు. గవర్నర్ తిరుమల […]

Advertisement
Update:2019-10-04 01:52 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలకు కొత్త గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తన వంతు సహకారం అందిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాధనం వృథా కాకుండా చేపట్టిన పొదుపు చర్యలకు గవర్నర్ కూడా మద్దతుగా నిలిచారు. తన కోసం ప్రభుత్వం పెట్టే వ్యక్తిగత ఖర్చులను, దుబారాను తగ్గించుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాన్ని ఆయన తిరస్కరించారు.

రాష్ట్ర గవర్నర్‌ హోదాలో ఆయన పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తుంది.. కానీ అందుకు ఆయన వద్దు అనేశారు. గవర్నర్ తిరుమల పర్యటన సందర్భంగా ప్రత్యేక విమానం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రత్యేక విమానం అంటే లక్షల్లో ఖర్చు అవుతుందని… అంత ప్రజాధనాన్ని తన కోసం వృథా చేయవద్దని కోరారు. అత్యవసరం ఏమి కాదు కాబట్టి ప్రత్యేక విమానం అవసరం లేదని… సాధారణ విమానాల్లోనే ప్రయాణం చేస్తానని అధికారులకు వివరించారు. విజయవాడ నుంచి నేరుగా తిరుమలకు సర్వీస్ లేదని అధికారులు చెప్పగా… హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి వెళ్తానని గవర్నర్ చెప్పారు.

చెప్పినట్టుగానే హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. తిరుమలలో కూడా ఆయన ఎక్కువ సేపు ఉండలేదు. తాను ఎక్కువ సేపు తిరుమలలో ఉంటే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, అధికారులు కూడా తన కోసం విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తుందని ఆయన భావించారు.

అందుకే స్వామి దర్శనం పూర్తికాగానే గంటలోనే తిరుగు ప్రయాణం అయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కూడా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంటనే… అధికారులు తిరిగి భక్తుల కోసం పూర్తి సమయం కేటాయించేందుకు వీలుగా రెండు గంటల్లోనే తాను తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు.

Tags:    
Advertisement

Similar News