అయ్యో సైరా.. మ్యాట్నీకే పైరసీ

ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సైరా సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. బడా సినిమాలన్నింటికీ కామన్ ప్రత్యర్థిగా మారిన తమిళ రాకర్స్ బృందం, సైరాపై కూడా విరుచుకుపడింది. మొదటి రోజే సైరా పైరసీ ప్రింట్ ను నెట్ లో పెట్టి సవాల్ విసిరింది. మరీ బాధాకరమైన విషయం ఏంటంటే.. విడుదలైన మొదటి రోజు, మ్యాట్నీ షోలకే పైరసీ ప్రింట్లు నెట్ లో దర్శనమిచ్చాయి. చాలామంది ఈ సినిమా పైరసీ లింక్స్ ను వాట్సాప్ లో షేర్ చేశారు. మరికొంతమంది […]

Advertisement
Update:2019-10-03 07:49 IST

ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సైరా సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. బడా సినిమాలన్నింటికీ కామన్ ప్రత్యర్థిగా మారిన తమిళ రాకర్స్ బృందం, సైరాపై కూడా విరుచుకుపడింది. మొదటి రోజే సైరా పైరసీ ప్రింట్ ను నెట్ లో పెట్టి సవాల్ విసిరింది. మరీ బాధాకరమైన విషయం ఏంటంటే.. విడుదలైన మొదటి రోజు, మ్యాట్నీ షోలకే పైరసీ ప్రింట్లు నెట్ లో దర్శనమిచ్చాయి.

చాలామంది ఈ సినిమా పైరసీ లింక్స్ ను వాట్సాప్ లో షేర్ చేశారు. మరికొంతమంది ఫేస్ బుక్ లో లింక్స్ పెట్టారు. ఇలా టోటల్ సినిమా మొత్తాన్ని పైరసీ చేసింది తమిళరాకర్స్ బృందం. నిజానికి పైరసీని అడ్డుకునేందుకు సైరా యూనిట్ చాలా గట్టిగా ప్రయత్నించింది. భారీగా టెక్నికల్ టీమ్ ను ఏర్పాటుచేసింది. వీళ్లంతా ఉదయం 6 గంటల నుంచే యాంటీ-పైరసీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిన్న చిన్న వీడియో క్లిప్పులతో పాటు థియేటర్లలో ప్రేక్షకులు తీసిన స్క్రీన్ షాట్స్ ను కూడా డిలీట్ చేయడం మొదలుపెట్టారు. అలా సైరాకు సంబంధించి ఏ చిన్న స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో కనిపించలేదు.

అయితే మధ్యాహ్నం సమయానికి ఒక్కసారిగా సైరా ఫుల్ మూవీ పైరసీ ప్రింట్ ప్రత్యక్షమయ్యేసరికి టెక్నికల్ టీమ్ అవాక్కయింది. దాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నించే క్రమంలోనే, నకిలీ వెబ్ సైట్స్, నకిలీ డొమైన్స్ తో మరిన్ని లింక్స్ పుట్టుకొచ్చాయి. ఇలా ఆన్ లైన్ లో అప్ లోడ్ అవ్వడంతో పాటు.. వాట్సాప్ లో షేర్స్ కూడా వైరల్ అవ్వడంతో పైరసీ విజృంభించింది. దీనిపై ఇవాళ సైరా యూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతోంది.

Tags:    
Advertisement

Similar News